Krishna Kowshik
Maar Muntha Chod Chinta Controversy.. పూరీ జగన్నాథ్, రాపో (రామ్ పోతినేని) నుండి రాబోతున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లను మెల్లిగా షురూ చేసింది. తాజాగా ఓ పాటను రిలీజ్ చేయగా..
Maar Muntha Chod Chinta Controversy.. పూరీ జగన్నాథ్, రాపో (రామ్ పోతినేని) నుండి రాబోతున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లను మెల్లిగా షురూ చేసింది. తాజాగా ఓ పాటను రిలీజ్ చేయగా..
Krishna Kowshik
టాలీవుడ్ ఇండస్ట్రీలో వర్సటైల్ డైరెక్టర్లలో ఒకరు పూరీ జగన్నాథ్. ఇతర డైరెక్టర్లు కూడా ఈర్ష పడేలా సినిమాలు తెరకెక్కిస్తుంటాడు. 2022లో విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన లైగర్ బెడిసికొట్టిందేమో కానీ.. అతడిలో ఫైర్ తగ్గలేదు. మూవీ అప్ అండ్ డౌన్స్ అతడికి కొత్తేమీ కాదు. బౌన్స్ బ్యాక్ అవ్వడం తనకు తెలిసినట్లుగా మరో దర్శకుడికి తెలియదంటే అతిశయోక్తి కాదు. సినిమాలే పంచ ప్రాణాలుగా బతికేసే ఈ మూవీ డైరెక్టర్ ఇప్పుడు డబుల్ ఎనర్జీతో దూసుకు వస్తున్నాడు. డబుల్ ఇస్మార్ట్ అంటూ ఓ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇది ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్. ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేని, కావ్య థాపర్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడు.
పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తున్నారు. మణి శర్మ బాణీలు సమకూరుస్తుండగా.. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆగస్టు 15న ఈ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్లను షురూ చేసింది చిత్ర యూనిట్. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, టైటిల్ సాంగ్ ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక తనదైన డైలాగ్, మార్క్ ఇందులో కనిపించాయి. ఇది కదా పూరీ నుండి తాము కోరుకున్నదీ అంటూ ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు ఫ్యాన్స్. అంతలో సెకండ్ సాంగ్ రిలీజ్ చేసింది. మార్ ముంత అంటూ సాగిపోయే పాటలో రామ్ ఎనర్జీకి, కావ్య పాప అందాలకు బాగా సెట్ అయ్యింది. కాస్లర్ శ్యామ్ రాసిన పాటకు ఓ హైప్, ఊపు వచ్చేస్తుంది. ఇక్కడ వరకు ఓకే కానీ.. ఈ మార్ ముంత పాట వివాదాస్పదమైంది. ఈ పాటలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫేమస్ డైలాగ్ ఒకటి వినిపిస్తుంది.
‘ఏం చేద్దామంటావ్ మరీ’ కేసీఆర్ వాయిస్ డైలాగ్ వినియోగించారు ఇందులో. ఇది బీఆర్ఎస్ నేతల మనో భావాలను హర్ట్ చేసింది. ఓ తెలంగాణ సాధకుడు, తమ మాజీ సీఎంని కేసీఆర్‌ను కించపరిచేలా ఈ చర్య ఉందంటూ మండిపడుతున్నారు. ముఖ్యంగా మహిళా నేతలు. ఆయన సినిమాలు అసాంఘిక కార్యకలాపాలను ప్రేరేపించేలా ఉంటాయని దర్శకుడు పూరీ జగన్నాథ్ పై విరుచుకు పడుతున్నారు. కేసీఆర్ డైలాగ్ పెట్టడంపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మీ సినిమాల ద్వారా ఏం సందేశం ఇద్దామని అంటున్నారని మండిపడుతున్నారు. వెంటనే ఆ డైలాగ్ తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కొంత మంది సోషల్ సైనికులు..పూరీకి మద్దతుగా మాట్లాడుతున్నారు. అదొక మీమ్ డైలాగ్ అని.. ఎక్కడైనా వినియోగించొచ్చు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదీ ఏమైనప్పటికీ.. ఈ పాటకు ఆ డైలాగ్ ప్లస్ అవుతుందనుకుంటే.. నెగిటివిటీని తెచ్చిపెడుతుంది. మరీ ఈ డైలాగ్ తీసేస్తారో లేదో చూడాలి.