iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సినీ రచయిత, బలగం నటుడు కన్నుమూత

ఇండస్ట్రీని విషాదాలు వీడటం లేదు. కొన్ని రోజుల క్రితం సినీ రచయిత నడిమింటి నరసింగ రావు కన్నుమూశారు. ఇప్పుడు మరో సినీ రచయిత, దర్శకుడు, నటుడు మరణించారు.

ఇండస్ట్రీని విషాదాలు వీడటం లేదు. కొన్ని రోజుల క్రితం సినీ రచయిత నడిమింటి నరసింగ రావు కన్నుమూశారు. ఇప్పుడు మరో సినీ రచయిత, దర్శకుడు, నటుడు మరణించారు.

ఇండస్ట్రీలో విషాదం..  ప్రముఖ సినీ రచయిత, బలగం నటుడు కన్నుమూత

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితం సినీ రచయిత నడిమింటి నరసింగ రావు కన్నుమూశారు. ఇప్పుడు మరో సినీ రచయిత మరణించారు. ప్రముఖ సినీ రచయిత వడ్డేపల్లి కృష్ణ తుదిశ్వాస విడిచారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. వడ్డేపల్లి కృష్ణ రచయిత కేవలం సినీ గేయ రచయిత మాత్రమే కాదు.. లలిత గీతాలపై పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఆయన రచించిన వందలాది లలిత గీతాలు ఆకాశవాణి, దూరదర్శన్‌లో కూడా ప్రసారమయ్యాయి. ఆయన కవి కూడా. 40కి పైగా నృత్య రూపకాలు రాశాలు. ఎన్నో పుస్తకాలు ప్రచురించారు. రెండు రోజుల క్రితమే తెలుగు సినీ రచయితల సంఘం ఆయన్ని జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది. అంతలోనే ఆయన మరణ వార్త చేరింది.

వడ్డేపల్లి కృష్ణ సిరిసిల్లలో చేనేత కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుండి సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. పోస్టుమాన్‌గా ఉద్యోగం చేస్తూ పాటలు రాసేశారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ నాగోల్‌లో స్థిరపడ్డారు. పిల్ల జమీందార్ చిత్రంలో ‘నీ చూపులోన విరజాజి వాన’, బాలకృష్ణ భైరవ ద్వీపం చిత్రంలో అంబా శాంభవి లాంటి ఆణిముత్యాల లాంటి పాటలు రచించారు. రెండు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. సాయికుమార్ హీరోగా వచ్చిన ఎక్కడికి వెళ్తుందో మనసు, లావణ్య విత్ లవ్ బాయ్స్ దర్శకుడు ఆయనే. గత ఏడాది సెన్సేషనల్ సృష్టించిన బలగం చిత్రంలో కూడా నటించారు వడ్డే పల్లి కృష్ణ. గోభాగ్యం అనే లఘు చిత్రానికి ఆయనే దర్శక, నిర్మాత. దీనికి ఎన్నో పురస్కారాలు లభించాయి. బతుకమ్మ, రామప్ప రామణీయం లాంటి లఘు చిత్రాలకు నంది పురస్కారాలు వచ్చాయి.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జయ జయహే తెలంగాణ నృత్య రూపకం రచించగా అన్ని వేదికలపైనా ఆ నృత్య రూపకం మార్మోగింది. ప్రముఖ సినీ గేయరచయిత సినారెకు ఇండస్ట్రీలో ఇష్టమైన సినీ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ. ఆటా, తానా వేడుకల్లో ప్రతి ఏటా, సాహిత్య చర్చల్లోనూ పాల్లొంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. 1968లో స్రవంతి, కృష్ణాపత్రిక వంటి పత్రికల్లో పద్యాలు, గేయాలతో పాటు కవికల్యాణం, గడ్డిపువ్వు, గాంధీ, మూడుపూలు ఆరుకాయలు, సంక్రాంతిలక్ష్మి, స్వదేశీయం, వివేకానంద విజయం, ఆమ్రపాలి, బతుకమ్మ,  మొదలగు అనేక సంగీత నృత్య రూపకాలు వ్రాశాడు.