iDreamPost
android-app
ios-app

నిన్న కమల్.. నేడు రజినీ! లక్ అంటే లోకేష్ దే!

  • Author ajaykrishna Updated - 01:36 PM, Tue - 12 September 23
  • Author ajaykrishna Updated - 01:36 PM, Tue - 12 September 23
నిన్న కమల్.. నేడు రజినీ! లక్ అంటే లోకేష్ దే!

లోకేష్ కనగరాజ్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఇప్పటిదాకా తీసింది నాలుగు సినిమాలే. కానీ.. లైఫ్ టైమ్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. నగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్.. ఇప్పుడు లియో.. దర్శకుడిగా లోకేష్ స్థాయిని ఒక్కో మెట్టు పెంచుతూ వస్తున్నాయి. దర్శకుడు పూరి జగన్నాథ్ పోకిరి సినిమాలో చెప్పినట్లు.. ‘ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా! బుల్లెట్ దిగిందా లేదా?’ అన్న డైలాగ్ లోకేష్ కి కరెక్ట్ గా సరిపోతుంది. నాలుగు సినిమాలతో పాన్ ఇండియా వైడ్ గుర్తింపు.. అన్ని భాషలలో ఫ్యాన్ ఫాలోయింగ్.. ఇలా దర్శకుడిగా సాధించాల్సినవి సాధించేసాడు.

ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత.. లేదా అడుగు పెట్టకముందే సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్, మెగాస్టార్, అమితాబ్ లాంటి లెజెండ్స్ తో వర్క్ చేయాలని అందరు కలలు కంటారు. తీరా వచ్చాక.. పరిస్థితులు మారిపోయి అవకాశం ఇచ్చిన వారితో సినిమాలు చేసేస్తుంటారు. కానీ.. కొందరిని మాత్రమే తక్కువ టైమ్ లో అదృష్టం గట్టిగా పట్టేసుకుంటుంది. ప్రెజెంట్ లోకేష్ లైఫ్ లో అదే జరుగుతుంది. సూపర్ స్టార్స్ లోకేష్ ని పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు. అలాగే లోకేష్ తో వర్క్ చేయాలని ఉందంటూ వేరే భాషల స్టార్ హీరోలు మనసు విప్పి మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. లోకేష్ కి లక్ రేంజ్ ఎలా ఉందో!

దర్శకుడిగా మారాక కొన్ని హిట్స్ కొట్టినా కొట్టకపోయినా కార్తీ, సూర్య, విజయ్ లాంటి హీరోలతో సినిమాలు ఓకే చేసుకోవచ్చు. అదే విశ్వనటుడు కమల్ హాసన్.. సూపర్ స్టార్ రజినీకాంత్ లతో సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ.. ఇవన్నీ చేసి చూపిస్తున్నాడు లోకేష్. ఖైదీ, విక్రమ్ సినిమాలతో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసిన లోకేష్.. ఇప్పుడు లియోతో దళపతి విజయ్ ని తన యూనివర్స్ లో భాగం చేస్తున్నాడు. ఆల్రెడీ సూర్య, కార్తీ, కమల్ అందులో ఉన్నారు. ఇప్పుడు లియో తర్వాత రజినీతో సినిమా చేయనున్నాడు లోకేష్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. మరి ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్న దర్శకులే చేసి చూపించలేనిది.. లోకేష్ ఇలా వచ్చిరాగానే చేసుకుంటూ పోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet