iDreamPost
android-app
ios-app

కూలీపై ఆడియన్స్ అంచనాలపై లోకేష్ ఏమన్నాడంటే !

  • Published Sep 02, 2025 | 11:20 AM Updated Updated Sep 02, 2025 | 11:20 AM

గత కొంతకాలంగా భారీ క్యాస్టింగ్ స్టార్ డైరెక్టర్ నుంచి భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయిన సినిమాలు డిజాస్టర్ అవుతూ వస్తున్నాయి. అయినా సరే ఇంకో కొత్త సినిమా టాప్ డైరెక్టర్, టాప్ హీరో కాంబినేషన్ లో వస్తుందంటే.. ఆడియన్స్ ఆశలు చావడం లేదు

గత కొంతకాలంగా భారీ క్యాస్టింగ్ స్టార్ డైరెక్టర్ నుంచి భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయిన సినిమాలు డిజాస్టర్ అవుతూ వస్తున్నాయి. అయినా సరే ఇంకో కొత్త సినిమా టాప్ డైరెక్టర్, టాప్ హీరో కాంబినేషన్ లో వస్తుందంటే.. ఆడియన్స్ ఆశలు చావడం లేదు

  • Published Sep 02, 2025 | 11:20 AMUpdated Sep 02, 2025 | 11:20 AM
కూలీపై ఆడియన్స్ అంచనాలపై లోకేష్ ఏమన్నాడంటే !

గత కొంతకాలంగా భారీ క్యాస్టింగ్ స్టార్ డైరెక్టర్ నుంచి భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయిన సినిమాలు డిజాస్టర్ అవుతూ వస్తున్నాయి. అయినా సరే ఇంకో కొత్త సినిమా టాప్ డైరెక్టర్, టాప్ హీరో కాంబినేషన్ లో వస్తుందంటే.. ఆడియన్స్ ఆశలు చావడం లేదు. పోనీ ఈసారైనా సినిమా వారిని శాటిస్ఫై చేస్తుందా అంటే అదీ లేదు. మళ్ళీ మళ్ళీ డిస్సపోయింట్ అవుతూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో అలా నిరాశ పరిచిన సినిమా ఏదైనా ఉందంటే అది కూలీ సినిమానే. ఖైదీ , విక్రమ్ సినిమాలతో లోకేష్ కనగరాజ్ మార్క్ ఏంటో అందరికి అర్థమైపోయింది.

నెక్స్ట్ రజినితో సినిమా అంటే అంతకుమించి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. పైగా రిలీజ్ కు ముందు వరకు వచ్చిన అప్డేట్స్ కూడా అంతే అంచనాలను పెంచేశాయి. తీరా సినిమా చూస్తే మాత్రం లాజిక్స్ కు అందని సీన్లు , బోరింగ్ స్క్రీన్ ప్లే , మేము ఊహించింది ఇది కాదు అనే రివ్యూలు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి లోకేష్ మాట్లాడుతూ.. అసలు సినిమా మీద ఇలాంటి అంచనాలు పెట్టుకోవడం ప్రేక్షకుల తప్పే అని అన్నాడు. తానూ ముందే ఈ సినిమా LCU లో భాగం కాదని స్పష్టంగా చెప్పానని.. అయినా ప్రేక్షకులు సినిమా మీద ఏవేవో అంచనాలను పెట్టుకుని థియేటర్స్ కు వచ్చారని.. దానికి తానేమి చేయలేనని చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయానంటే.. మరోసారి మరో సినిమాతో వారిని మెప్పిస్తానని చెప్పాడు. పైగా ఈసారి ప్రేక్షకులు ఎలాంటి అంచనాలను పెట్టుకోలేని విధంగా మూవీ తీస్తానని చెప్పడం గమనార్హం. సాధారణంగా అయితే కూలీ తర్వాత అతను ఖైదీ 2 తీయాల్సి ఉంది. కానీ రీసెంట్ గా రజిని కాంత్ , కమల హాసన్ కలయికలో మూవీ తీయబోతున్నట్లు వార్తాలు వినిపిస్తున్నాయి. ఇక లోకేష్ చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉందో ఆయనకే తెలియాలి. ఇకపై ప్రేక్షకులు సినిమాల విషయంలో ఎలాంటి అంచనాలను పెట్టుకుంటారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.