iDreamPost
android-app
ios-app

వరుణ్‌-లావణ్యల పెళ్లికి సమంత-నాగ చైతన్య!!

  • Published Nov 01, 2023 | 8:19 AM Updated Updated Nov 01, 2023 | 12:08 PM

వీరు ఇప్పటికే ఇటలీ బయలు దేరి వెళ్లినట్లు తెలుస్తోంది. నిన్న రిసార్ట్‌లో హల్దీ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీలు సందడి చేశాయి.

వీరు ఇప్పటికే ఇటలీ బయలు దేరి వెళ్లినట్లు తెలుస్తోంది. నిన్న రిసార్ట్‌లో హల్దీ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీలు సందడి చేశాయి.

  • Published Nov 01, 2023 | 8:19 AMUpdated Nov 01, 2023 | 12:08 PM
వరుణ్‌-లావణ్యల పెళ్లికి సమంత-నాగ చైతన్య!!

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠిల పెళ్లి వేడుక ఈ రోజు ఘనంగా జరగనుంది. ఇటలీలోని టస్కనీలో పెళ్లి వేడుక జరగనుంది. అక్కడి బార్గో సాన్ ఫెలిసే రిసార్ట్‌లో ఇద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే రెండు ఫ్యామిలీ పెద్దలు రిసార్ట్‌కు చేరుకున్నారు. ఆహ్వానం అందిన ఇతర బంధు,మిత్రులు నిన్నే ఇటలీ బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. పెళ్లికి ఆహ్వానం అందిన వారిలో సమంత, నాగచైతన్య, నితిన్‌ దంపుతులు, రష్మిక మందనలు కూడా ఉన్నారట.

వీరు ఇప్పటికే ఇటలీ బయలు దేరి వెళ్లినట్లు తెలుస్తోంది. నిన్న రిసార్ట్‌లో హల్దీ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీలు సందడి చేశాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ రోజు మధ్యాహ్నం 2.48 గంటలకు వరుణ-లావణ్యల పెళ్లి ముహూర్తం ఉంది. పెళ్లి తర్వాత రాత్రి 8.30 నుంచి రిసెప్షన్ ఉంటుంది. కాగా, పెళ్లికి రెండు రోజుల ముందు నుంచే సందడి మొదలైంది. మెగా, అల్లు ఫ్యామిలీలకు సంబంధించి మొత్తం మూడు పార్టీలు జరిగాయి.

మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో ఓపార్టీ జరిగింది. తర్వాత అల్లు అర్జున్‌ ఓ పార్టీ ఇచ్చాడు. మొన్న కాక్‌టైల్‌ పార్టీ జరిగింది. ఈ కాక్‌టైల్‌ పార్టీలో రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ ఇద్దరూ పాల్గొన్నారు. దీంతో గత కొద్దిరోజులనుంచి జరుగుతున్న పుకార్లకు చెక్‌ పడింది. చరణ్‌-బన్నీలు ఒకే ఫ్రేములో కనిపించి సందడి చేసి ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. మరి, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠిల పెళ్లి వేడుకపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet