iDreamPost
android-app
ios-app

లియో – టైగర్ – కేసరి.. ఎగ్జిబిటర్లు వెనక్కి?

  • Author ajaykrishna Updated - 11:39 AM, Mon - 16 October 23
  • Author ajaykrishna Updated - 11:39 AM, Mon - 16 October 23
లియో – టైగర్ – కేసరి.. ఎగ్జిబిటర్లు వెనక్కి?

ఈ ఏడాది దసరాకు బాక్సాఫీస్ పోరు గట్టిగా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 19న దళపతి విజయ్ నటించిన లియో రిలీజ్ అవుతుండగా.. అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు, భగవంత్ కేసరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో లియో, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయి. అటు విజయ్ కి ల, ఇటు రవితేజకు ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్ మూవీస్ ఇవి. కాగా.. ఇప్పటికే సినిమాల ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. మరోవైపు అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కూడా మొదలైపోయాయి. మూడు సినిమాలు దేనికవే ఫుల్ బజ్ క్రియేట్ చేసుకున్నాయి.

ఈ క్రమంలో.. మూడు సినిమాలకు సంబంధించి టాలీవుడ్ బిజినెస్ జరిగిపోయిందట. కానీ.. ఒక విషయంలో ఎగ్జిబిటర్స్ వెనకడుగు వేస్తున్నారని సమాచారం. ఆ వివరాల్లోకి వెళ్తే.. లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు ఆంధ్రాలో బిజినెస్ ఇంకా పూర్తి కాలేదట. ఎగ్జిబిటర్లు ఈ సినిమాలను తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. జనరల్ గా దసరా అంటే పెద్ద సినిమాలు రిలీజ్ అయి థియేటర్స్ వద్ద ఓ పండుగ వాతావరణం కనిపిస్తుంది. అలాంటి వాతావరణం ఇప్పుడు ఆంధ్రాలో కనిపించడం లేదని వినికిడి. ఇంటర్నల్ బిజినెస్ స్లోగా జరుగుతుందని.. ఎందుకంటే మూడు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువ ప్రైస్ కోట్ చేస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుత ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. ఆంధ్రాలో ఆరు ఏరియాలు కలిపి లియోకి రూ. 10 కోట్లు.. భగవంత్ కేసరికి రూ. 34 కోట్లు.. టైగర్ నాగేశ్వరరావుకు రూ. 17 కోట్లుగా కోట్ చేస్తున్నారట. దీంతో అంత బిగ్ డీల్ చూసి థియేటర్స్ ఎగ్జిబిటర్స్ రిస్క్ అని భావిస్తున్నారట. మూడు సినిమాల రిలీజ్ కి ఇంకా మూడు రోజులే ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. కాగా.. లియో మూవీని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించాడు. LCU లో భాగంగా సినిమా వస్తుందని టాక్ నడుస్తుంది. ఆల్రెడీ ఇదే విషయంపై సినిమాకు ఫుల్ హైప్ క్రియేట్ అయ్యింది. మరోవైపు ఫామ్ లో ఉన్న బాలయ్యతో అనిల్ రావిపూడి కాంబినేషన్.. రవితేజ ఫస్ట్ పాన్ ఇండియా అటెంప్ట్ అన్ని ఆసక్తికరంగా ఉన్నాయి. సో.. జనాలు థియేటర్స్ కి వచ్చి సినిమాలను ఎలా ఆదరిస్తారో చూడాలి. మరి ఈ సినిమాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/