iDreamPost
android-app
ios-app

లియో ప్లాప్ అనుకుంటున్నారా? లోకి అంత అమాయకుడు

  • Published Nov 10, 2023 | 10:39 AM Updated Updated Nov 10, 2023 | 10:39 AM

లోకేష్‌ కనకరాజ్‌ సినిమాలంటే.. సౌత్‌లోనే కాక దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్‌ ఏర్పడింది. దాంతో తాజాగా వచ్చిన లియో మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమా ఆశించిన మేర రాణించలేదు అంటున్నారు. కానీ కొందరు మాత్రం లియో ప్లాప్‌ కదని.. లోకి ఎంత తెలివిగా ఈ సినిమా తెరకెక్కించాడో వివరిస్తూ వీడియోలు చేస్తున్నారు. ఆ వివరాలు..

లోకేష్‌ కనకరాజ్‌ సినిమాలంటే.. సౌత్‌లోనే కాక దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్‌ ఏర్పడింది. దాంతో తాజాగా వచ్చిన లియో మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమా ఆశించిన మేర రాణించలేదు అంటున్నారు. కానీ కొందరు మాత్రం లియో ప్లాప్‌ కదని.. లోకి ఎంత తెలివిగా ఈ సినిమా తెరకెక్కించాడో వివరిస్తూ వీడియోలు చేస్తున్నారు. ఆ వివరాలు..

  • Published Nov 10, 2023 | 10:39 AMUpdated Nov 10, 2023 | 10:39 AM
లియో ప్లాప్ అనుకుంటున్నారా? లోకి అంత అమాయకుడు

లోకేష్‌ కనకరాజు.. తీసింది నాలుగు సినిమాలు మాత్రమే. 2017లో తమిళంలో తొలి సినిమా మానగరంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత కార్తీ హీరోగా.. ఖైదీ సినిమాను తెరకెక్కించి.. సినీ ఇండస్ట్రీలో ఒక కొత్త అధ్యాయానికి తెర తీశాడు. ఆ తర్వాత కమల్‌హాసన్‌, విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజల్‌ ముఖ్య పాత్రల్లో.. విక్రమ్‌ సినిమా తెరకెక్కించాడు. ఇక ఏడాది లియో మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. అయితే విక్రమ్‌ నుంచి లోకేష్‌ కనకరాజ్‌కు దేశవ్యాప్తంగా క్రేజ్‌ వచ్చింది. ఇక ఆ సినిమా తర్వాత లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ని క్రియేట్‌ చేశాడు. ఇక ఎల్‌సీయూలో వచ్చే చిత్రాలపై ప్రతి ఒక్కరిలో చాలా ఆసక్తి నెలకొంది. విక్రమ్‌, లియోలు ఎల్‌సీయూలోనే భాగమే. దాంతో లియో సినిమా ఖైదీ, విక్రమ్‌ రిఫరెన్స్‌లను పెట్టాడు.

అయితే లోకి సినిమాలను అర్థం చేసుకోవాలంటే.. ప్రతి చిన్న విషయాన్ని బాగా గమనించాలి. ఇక తాజాగా వచ్చిన లియో ఫ్లాప్‌ అని చాలా మంది భావించారు. కానీ లోకి ఆలోచనలను అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. లియో సినిమా అసంపూర్తిగా ఉంటుంది. కొన్ని పాత్రలకు క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఇక మూవీ చివర్లో విక్రమ్‌ వాయిస్‌ వినిపిస్తుంది. వీటన్నింటిని గమనిస్తే.. విక్రమ్‌, ఖైదీలలో వదిలిన హింట్స్‌కి.. లియోలో ఓ క్లారిటీ ఇస్తూ వచ్చినట్లు తెలుస్తోంది

అంతేకాక ప్రమోషన్స్‌ సమయంలోనే లోకి.. లియో సినిమా ప్రారంభంలో 10 మినిట్స్‌ అస్సలు మిస్‌ కాకూడదు అని చెప్పాడు. అంటే రాబోయే సినిమాల కోసం ప్రేక్షకులను ముందుగానే సెట్‌ చేశాడు లోకి. దాన్ని బట్టి చూస్తే ఫ్యూచర్లో మరి కొన్ని క్యారెక్టర్లు రావచ్చని.. వాటిల్లో మొత్తం కథ రివీల్‌ అయ్యే అవకాశం ఉంది అని అర్థం అవుతుంది. ప్రస్తుతం ఎల్‌సీయూకి సంబంధించి చాలా బ్రేక్‌డౌన్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

లోకి యూనివర్స్‌కి సంబంధించిన చిక్కుముడులు, కనెక్షన్స్‌ గురించి వివరిస్తూ.. వీడియోలు చేస్తున్నారు. వీటిల్లో వితిన్‌ సిని అనే యూట్యూబ్‌ చానెల్‌లో లియో సినిమాలో వదిలేసిన క్వశ్చన్స్‌, విక్రమ్‌, ఖైదీలతో ఉన్న కనెక్షన్స్‌ గురించి చాలా స్పష్టంగా వివరించాడు. లియో ప్లాఫ్‌ అనుకునేవారు ఈ వీడియో చూస్తే.. లోకి తెలివితేటలు, అతడు దాచిని నిజాలు అర్థం అవుతాయి. మీకోసం ఆ వీడియో ఇక్కడ. దీనిపై ఓ లుక్కేసి.. మీకెలా అనిపించిందో అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.