2023 దసరా పండుగ సందర్బంగా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ వార్ జరగబోతుంది. చాలకాలంగా స్టార్ హీరోల సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ చూడాలని వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కోరిక తీరనుంది. ఈసారి పోటీలో ఇద్దరు కాదు.. నలుగురు. తెలుగు నుండి ఇద్దరు కాగా.. తమిళ, కన్నడ నుండి ఇద్దరు బిగ్ స్టార్స్ సినిమాలు దసరాకు రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాలేవంటే.. దళపతి విజయ్ నటించిన లియో.. మాస్ రాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావు, నటసింహం బాలకృష్ణ భగవంత్ కేసరి, శివరాజ్ కుమార్ ఘోస్ట్. ఈ నాలుగు సినిమాలు కూడా ఫుల్ హైప్ క్రియేట్ చేసుకున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ అన్ని సినిమాలపై హైప్ పెంచేశాయి.
వీటిలో ముందుగా.. అక్టోబర్ 19న లియో వస్తుంది. దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ వస్తున్న లియోపై దళపతి ఫ్యాన్స్ ఆశలు మామూలుగా పెట్టుకోలేదు. అదిగాక సినిమాకు ముందునుండి లోకేష్ సినిమా అనే బజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. కాగా.. రీసెంట్ గా ట్రైలర్ మాత్రం మిక్సడ్ టాక్ సొంతం చేసుకుంది. అందుకు కారణం.. హాలీవుడ్ మూవీ ‘ఏ హిస్టరీ ఆఫ్ వయిలెన్స్’కి రీమేక్ అనే టాక్ ఉంది. ట్రైలర్ లో ఆ సినిమా పోలికలు చాలా ఉన్నాయి. దీంతో LCU అని వెయిట్ చేసిన ఫ్యాన్స్.. ఒక్కసారిగా నీరుగారిపోయారు. అయినా లోకేష్ ని నమ్మలేం. ఎందుకంటే.. ఏదొక పాయింట్ లో విజయ్ లియో క్యారెక్టర్ ని LCU లో భాగం చేసే అవకాశం కూడా లేకపోలేదు.
ఇక అక్టోబర్ 20న రవితేజ టైగర్ నాగేశ్వరరావు.. బాలకృష్ణ భగవంత్ కేసరి.. శివరాజ్ కుమార్ ఘోస్ట్ సినిమాలు వస్తున్నాయి. వీటిలో ఘోస్ట్ సినిమాకు పెద్దగా బజ్ లేదు. బట్ హిట్ టాక్ వస్తే నిలబడే ఛాన్స్ ఉంది. ఇక టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ పాజిటివ్ టాక్ తెచ్చుకొని హైప్ పెంచేసింది. పైగా పాన్ ఇండియా రిలీజ్ అవుతోంది. సో.. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఎవరు ఆపలేరు. ఇక భగవంత్ కేసరి ట్రైలర్ కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సో.. టైగర్, కేసరి సినిమాలకు ఆల్రెడీ పాజిటివ్ బజ్ ఏర్పడింది. గనుక బాక్సాఫీస్ వద్ద పోటీ అనేది ఈ రెండింటికి హోరాహోరిగా సాగనుంది. సో.. టైగర్, కేసరిల మధ్య లియో తట్టుకోలేకపోవచ్చు అనే టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే.. అది రీమేక్ అని కన్ఫర్మ్ అయితే ఇంకా బజ్ తగ్గే ఛాన్స్ ఉంది. మరి తెలుగులో లియోకి బజ్ అంతంత మాత్రమే అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.. మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్స్ లో తెలపండి.