iDreamPost
android-app
ios-app

ఫ్యాన్స్ కి బిగ్ షాకిచ్చిన లియో మేకర్స్! ట్వీట్ వైరల్!

  • Author ajaykrishna Updated - 08:11 AM, Wed - 27 September 23
  • Author ajaykrishna Updated - 08:11 AM, Wed - 27 September 23
ఫ్యాన్స్ కి బిగ్ షాకిచ్చిన లియో మేకర్స్! ట్వీట్ వైరల్!

అభిమాన హీరో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ లో ఉత్సాహం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతిసారి.. ప్రతీ సినిమా సెలెబ్రేట్ చేసుకుంటున్నప్పటికీ.. కొత్త సినిమాని ఇంకా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తుంటారు. రిలీజ్ కి దగ్గర పడుతున్న హీరో సినిమా కోసం చాలా ప్లానింగ్, ఏర్పాట్లు చేసేసుకుంటారు. సాంగ్స్ రిలీజ్ అయితే ఒకలా.. ట్రైలర్ రిలీజ్ సెలెబ్రేషన్స్ ఇంకోలా.. ఇలా దేనికవే ప్లాన్ చేస్తుంటారు. ఇప్పుడు దళపతి విజయ్ లియో మూవీ విషయంలోను అదే జరిగింది. విజయ్ కి ఫ్యాన్ బేస్ ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే. సినిమా ఎలా ఉన్నా.. ఫ్యాన్స్ అంతా కలిసి హిట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు.

అలాంటిది సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో సినిమా అంటే.. మినిమమ్ అంచనాలు పెట్టేసుకుంటారు. ఎందుకంటే.. ఆల్రెడీ వరుస బ్లాక్ బస్టర్స్ తో ఫామ్ లో ఉన్నాడు.. పైగా విజయ్ కి మాస్టర్ లాంటి మంచి హిట్ ఇచ్చాడు. సో.. ఇప్పుడు లియో మూవీ చేస్తున్నాడు కాబట్టి.. అంచనాలు ఉండటం గ్యారంటీ. ఖైదీ, విక్రమ్ సినిమాలతో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేశాడు లోకేష్. ఇప్పుడు లియోతో విజయ్ ని తన యూనివర్స్ లో ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో.. ఖైదీ, విక్రమ్ లతో మిక్సింగ్ అంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందోనని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తూ.. పీక్స్ లో అంచనాలు పెట్టేసుకున్నారు. అక్టోబర్ 19న లియో పాన్ ఇండియా భాషలలో రిలీజ్ అవుతోంది.

కాగా.. కోలీవుడ్ సినిమాలకు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నే ఆడియో లాంచ్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే.. వాళ్ళు ఒకేసారి సినిమాకు సంబంధించి బిగ్ ఈవెంట్ జరిపి.. మిగతా ప్రమోషన్స్ చూసుకుంటారు. లియో కోసం బిగ్ రేంజ్ లో సెప్టెంబర్ 30న ఆడియో లాంచ్ ప్లాన్ చేశారు మేకర్స్. అందుకోసం టికెట్స్, పాసులకు అనుకున్న దానికంటే ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. దీంతో చేసేదేం లేక ఆడియో లాంచ్ క్యాన్సిల్ చేసింది మూవీ టీమ్. ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటిస్తూ.. ట్విట్టర్ లో పోస్ట్ కూడా పెట్టారు. ఆడియో లాంచ్ కి ఫ్యాన్స్ ఊహించని స్థాయిలో వస్తే క్రౌడ్ కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. పైగా ఏదైనా తప్పిదం జరిగితే అందరు బాధపడాల్సి వస్తుంది. సో.. ఆడియో లాంచ్ ని క్యాన్సిల్ చేస్తున్నట్లు వారు తెలిపారు. అంతేగాక ఇందులో ఎలాంటి పొలిటికల్ ప్రెజర్ లేదని మెన్షన్ చేయడం గమనార్హం. ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో విజయ్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. కానీ.. వరుస అప్డేట్స్ తో సర్ప్రైజ్ చేస్తామని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. మరి లియో మేకర్స్ నిర్ణయం కరెక్ట్ అంటారా.. మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişcasibom