iDreamPost
android-app
ios-app

ఆ లెజెండరీ క్రికెటర్ నానికి బిగ్ ఫ్యాన్! ఆయన ఎవరో తెలుసా..?

  • Author ajaykrishna Published - 02:14 PM, Wed - 27 September 23
  • Author ajaykrishna Published - 02:14 PM, Wed - 27 September 23
ఆ లెజెండరీ క్రికెటర్ నానికి బిగ్ ఫ్యాన్! ఆయన ఎవరో తెలుసా..?

ఇండస్ట్రీలో ఏ హీరోకైనా ఫ్యాన్స్ ఉండటం మామూలే. స్టార్ హీరోల విషయంలో సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఫ్యాన్స్ ఉంటారు. ఒక రకంగా పర్సనల్ గా సెలబ్రిటీలు అయినప్పటికీ.. వాళ్ళు అభిమానించే సినీ తారలు ఉండనే ఉంటారు. ఎందుకంటే.. ఎలాంటి ప్రొఫెషన్ లో ఉన్నవారికైనా.. ఎంటర్టైన్మెంట్ అనేది అవసరం. ఆ ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు లెజెండ్స్ సైతం సినిమాలు, టీవీ షోలు చూస్తుంటారు. వారికి నచ్చిన హీరోలను అభిమానించడం మొదలు పెడతారు. అయితే.. టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎలాంటి ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగి.. చాలామంది అప్ కమింగ్ హీరోలకు ఆదర్శంగా నిలిచాడు.

ఇక నానికి తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా వేరే భాషలలో సైతం ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. తన సినిమాలు వేరే భాషలలో డబ్బింగ్ అవ్వడం ద్వారా.. దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. నానికి ఫ్యాన్స్ అంటే.. ఏజ్ లిమిట్ ఏం లేదు. ఆరేళ్ళ పిల్లల దగ్గర నుండి అరవై ఏళ్ళ పెద్ద వారి వరకు నానిని అభిమానిస్తున్నారు. అయితే.. నానికి సామాన్యులు, సెలబ్రిటీలతో పాటు లెజెండరీ పర్సనాలిటీస్ సైతం ఫ్యాన్స్ గా ఉన్నారట. ఈ విషయాన్నీ వారే చెప్పడం విశేషం. ఇంతకీ ఆ లెజెండ్ ఎవరో కాదు.. మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్. ఆయన గురించి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ లవర్స్ కి పరిచయం అక్కర్లేదు.

Mutthaiah muralidharan big fan of nani

ప్రస్తుతం ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా ‘800’ అనే మూవీని బయోపిక్ గా రూపొందించారు. హైదరాబాది క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ గెస్ట్ గా 800 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అక్టోబర్ 6న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో.. వివిధ భాషలలో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ సందర్బంగా ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ.. నాని గురించి ప్రస్తావించారు. తాను నానితో ఇదివరకు ఓసారి మాట్లాడినప్పుడు తానంటే అభిమానం ఉందని చెప్పలేదు అన్నారు. మీకు ఫేవరేట్ తెలుగు హీరో ఎవరు? అని అడగ్గా.. అందరూ అద్భుతంగా సినిమాలు చేస్తున్నారు. అయితే.. వారిలో నాకు నాని నా ఫేవరేట్. నాని నటన వైవిధ్యంగా ఉంటుంది. యాక్షన్ కంటే డ్రామా, ఎమోషన్స్ ఎక్కువ వాల్యూ ఉంటాయి. శ్యామ్ సింగరాయ్, జెర్సీ, ఈగ.. ఇలా చాలా సినిమాలు చూశా అని మురళీధరన్ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి మురళీధరన్ మాటల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.