iDreamPost
android-app
ios-app

సెకండ్ మూవీ గురించి క్రేజీ అప్డేట్! వైరల్ అవుతున్న లెజెండ్ వీడియో!

  • Author ajaykrishna Published - 11:21 AM, Wed - 16 August 23
  • Author ajaykrishna Published - 11:21 AM, Wed - 16 August 23
సెకండ్ మూవీ గురించి క్రేజీ అప్డేట్! వైరల్ అవుతున్న లెజెండ్ వీడియో!

లెజెండ్ శరవణన్.. ఈ పేరు గురించి సినిమా లవర్స్ అందరికీ పరిచయం లేకపోవచ్చు. కానీ.. గతేడాది ఈ పేరు ఇండస్ట్రీలో చాలా గట్టిగా వినిపించింది. అందుకు కారణం.. బిజినెస్ మ్యాన్ అయినటువంటి అరుల్ శరవణన్.. 52 ఏళ్ల వయసులో హీరోగా డెబ్యూ చేయడమే. అవును.. తమిళనాడులో పేరొందిన శరవణ స్టోర్స్ క్లాత్స్ బిజినెస్ యజమానియే ఈ శరవణన్. అప్పుడప్పుడు తన బిజినెస్ కి సంబంధించి కమర్షియల్ యాడ్స్ లో హీరోయిన్స్ తో మెరుస్తుంటాడు. అయితే.. నటనపై మక్కువతో లేట్ వయసులో హీరోగా ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేసాడు. మొత్తానికి గతేడాది ‘ది లెజెండ్’ మూవీతో హీరోగా మారి తన కల నెరవేర్చుకున్నాడు.

ఇక మొదటి సినిమానే తమిళంతో పాటు తెలుగు, హిందీ.. ఇలా అన్ని భాషలలో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేశాడు. సినిమా ప్రమోషన్స్ కూడా పదిమంది హీరోయిన్స్ తో గ్రాండ్ గా జరిపాడు. కానీ.. ఏం లాభం హీరో కటౌట్ లేకపోవడంతో ఆడియన్స్ సినిమాని థియేటర్స్ లో చూడకుండా ఉండిపోయారు. వెరసి సినిమా ప్లాప్. అయినా సరే.. ఏమాత్రం తగ్గకుండా ఈసారి డబుల్ ఉత్సాహంతో రాబోతున్నాడు లెజెండ్. మొదటి సినిమాని చాలా పేరున్న టెక్నీషియన్స్ తో తీశాడు. దానికి నిర్మాత కూడా ఈయనే కావడం విశేషం. అయితే.. ఫస్ట్ మూవీ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు సెకండ్ మూవీకి రెడీ అయిపోయాడు లెజెండ్ శరవణ.

తాజాగా ఇండిపెండెన్స్ డే సందర్బంగా తన రెండో సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. తమిళనాడులోని ఓ పాఠశాలలో పిల్లలతో కలిసి ఇండిపెండెన్స్ డే సెలెబ్రేట్ చేసుకున్న శరవణన్.. పిల్లలందరికి గిఫ్టులు ఇచ్చాడు. అనంతరం.. త్వరలోనే కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించ బోతున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం కథ రెడీ అయ్యిందని.. కొద్దిరోజులలో అనౌన్స్ చేయనునట్లు క్లారిటీ ఇచ్చాడు. అలాగే స్పెషల్ డే రోజున పిల్లల మధ్య ఈ అప్డేట్ షేర్ చేయడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు లెజెండ్. ప్రస్తుతం ఈ లెజెండ్ కొత్త అప్డేట్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు శరవణ కంబ్యాక్ రాబోతున్నాడని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి హీరో అరుల్ శరవణన్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ