iDreamPost
android-app
ios-app

పెళ్లి షాపింగ్‌లో వరుణ్‌, లావణ్య.. వైరల్‌గా మారిన వీడియో!

  • Published Sep 16, 2023 | 9:49 PM Updated Updated Sep 16, 2023 | 9:49 PM
  • Published Sep 16, 2023 | 9:49 PMUpdated Sep 16, 2023 | 9:49 PM
పెళ్లి షాపింగ్‌లో వరుణ్‌, లావణ్య.. వైరల్‌గా మారిన వీడియో!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి మరికొన్ని నెలల్లో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. నవంబర్‌ 1న వీరి పెళ్లికి డేట్‌ ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. ఇటలీలోని ఓ ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు సమాచారం. వీరి పెళ్లికి అత్యంత సన్నిహితులు, బంధు మిత్రులు మాత్రమే హాజరకానున్నారట. మీడియా ప్రచారాలు, పుకార్లు తప్పితే.. పెళ్లికి సంబంధించి రెండు కుటుంబాలనుంచి ఇప్పటి వరకు మరో అప్‌డేట్‌ ఇవ్వలేదు. అప్‌డేట్లు బయటకు ఇవ్వకపోయినప్పటికి..

పెళ్లికి సంబంధించిన పనుల్ని రెండు కుటుంబాలు చకచకా చేసుకుపోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వధూవరులు పెళ్లికి సంబంధించిన షాపింగ్‌ మొదలుపెట్టినట్లు సమాచారం. తాజాగా వరుణ్‌ తేజ్‌- లావణ్య జంట హైదరాబాద్‌లోని ప్రముఖ సెలబ్రిటీ డ్రెస్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రాకు చెందిన షో రూమ్‌కు వెళ్లారు. వివాహానికి సంబంధించిన దుస్తులతో పాటు ఇతర వస్తువులు కొనుగోలు చేయటం కోసమే వీరు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss