iDreamPost
android-app
ios-app

నా పోరాటం కొనసాగిస్తా.. ఆమరణ దీక్షకు దిగుతా: లావణ్య

Rajtharun and Lavanya Case: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హీరో రాజ్ తరుణ్ ఆయన మాజీ ప్రియురాలు లావణ్యకి సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే ముగ్గురిపై కేసు నమోదు కాగా.. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు లోకి వస్తున్నాయి.

Rajtharun and Lavanya Case: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హీరో రాజ్ తరుణ్ ఆయన మాజీ ప్రియురాలు లావణ్యకి సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే ముగ్గురిపై కేసు నమోదు కాగా.. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు లోకి వస్తున్నాయి.

నా పోరాటం కొనసాగిస్తా.. ఆమరణ దీక్షకు దిగుతా: లావణ్య

సినీ ఇండస్ట్రీకి చెందిన ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజ్ తరుణ- లావణ్యకు సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. రాజ్ తరుణ్- లావణ్య ల వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. రాజ్ తరుణ్ తో తాను పదకొండేళ్లుగా సహజీవనం చేశానని.. తమ పెళ్లి 2014 జరిగిందని ఆరోపించింది లావణ్య. తనకు రెండుసార్లు అబార్షన్ చేయించాడని.. ఆ ఖర్చు కూడా రాజ్ తరుణ్ భరించాడనిని తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారలతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మయాంక్ మల్హోత్రలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే లావణ్య ఆత్మహత్యా యత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానంటుంది లావణ్య. పూర్తి వివరాల్లోకి వెళితే..

గత పదిరోజులుగా యంగ్ హీరో రాజ్ తరుణ్ ఆయన మాజీ ప్రియురాలు లావణ్యకు సంబంధించిన కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తుంది. పదేళ్లపాటు రాజ్ తరుణతో కలిసి ఉన్నానని.. ఇద్దరం 2014లో పెళ్లి చేసుకున్నామని లావణ్య ఆరోపిస్తుంది. తమ విషయం ఇండస్ట్రీలో కొంతమందికి తెలుసునని.. రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు కూడా తమ బంధం గురించి తెలుసు అని అంటుంది. తనకు రెండు సార్లు అబార్షన్ చేయించాని ఆరోపిస్తుంది. నటి మాల్వీ మల్హోత్ర మోజులో పడి రాజ్ తరుణు తనకు దూరమవుతున్నాడన్నాని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే తన వద్ద ఉన్న ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే శుక్రవారం రాత్రి లావణ్య ఆత్మహత్యా యత్నం చేసుకోవడం.. సమయానికి నార్సింగ్ పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి రక్షించారు.

ఈ సందర్భంగా లావణ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘ నా గురించి తెలిసిన వాళ్లు నాకు వ్యతిరేకంగా మట్లాడుతున్నారు. నాకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు. రేపు ‘మా’ అసోసియేషన్ కి వెళ్లి కలుస్తా.. నేను ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్దంగా ఉన్నాను. మొదటి సారి ఫిర్యాదు చేస్తే ఫార్మాట్ లో లేదని అన్నారు. అందుకే పూర్తి ఆధారాలతో రెండోసారి పోలీసుల ముందుకు వెళ్లాను. 170 ఫోటోలు, వీడియోలు ఉన్న ఆధారాలతో స్టేషన్ లో ఫిర్యాదు చేశాను. ఒక ఎఫ్ఐఆర్ కాపీ మాత్రం ఇచ్చారు. కానీ రాజ్ తరుణ్ పై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులు వస్తున్నాయి.. నాకు ప్రాణ హాని ఉంది. నాకు రక్షణ కల్పించండి. నాకు రాజ్ తరుణ్ కావాలి.. అతను దక్కకుంటే నేను ప్రాణాలతో ఉండను.. చచ్చే వరకు పోరాటం చేస్తాను’ అని ఆవేదన వ్యక్తం చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి