iDreamPost
android-app
ios-app

గామిపై లేడీ అమితాబ్ ప్రశంసల జల్లు

మహా శివరాత్రి పర్వదినాన రిలీజై మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటున్న చిత్రం గామి. విశ్వక్ సేన్ డిఫరెంట్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంపై లేడీ అమితాబచ్చన్ ప్రశంసల జల్లు కురిపించారు.

మహా శివరాత్రి పర్వదినాన రిలీజై మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటున్న చిత్రం గామి. విశ్వక్ సేన్ డిఫరెంట్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంపై లేడీ అమితాబచ్చన్ ప్రశంసల జల్లు కురిపించారు.

గామిపై లేడీ అమితాబ్ ప్రశంసల జల్లు

ఇటీవలే విడుదలైన విష్వక్సేన్ స్టారర్ గామి హై ఎక్లైమ్ తో సక్సెస్ ఫుల్గా దూసుకెళ్తోంది. మొట్టమొదట రాజమౌళి లాంటి గ్రేట్ డైరెక్టర్ రిలీజుకి ముందే సినిమా గురించి ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. రాజమౌళి చెప్పినట్టుగానే గామి రిలీజై అందరినీ స్టన్ చేసేసింది. అటువంటి కథని ఎంచుకున్న యంగ్ హీరో విష్వక్సేన్ మీద అభినందనల పూల వర్షమే కురిసింది. పైగా విష్వక్సేన్ ఫెర్ఫ్మామెన్స్ అందరినీ ఆకట్టుకోవడంతో యాక్టర్ గా కూడా గొప్ప పేరు సంపాదించుకున్నాడు విష్వక్సేన్. డైరెక్టర్ విద్యాధర్ కగిత తీసుకున్న కథాంశం వినూత్నమైనది, విలక్షణమైనది.

ఎవ్వరూ ఊహించని ప్లెయిన్లో కథని చెప్పడమే కాదు, అత్యద్భుతమై టెక్నికల్ వేల్యూస్ తో తెరకెక్కించడంతో డైరెక్టర్ గా విద్యాధర్ ఎక్కువ మార్కులే కొట్టేశాడు. సినిమా గురించి ఐ డ్రీమ్ చీఫ్ ఎడిటర్ నుంచి తెలుసుకున్న లేడీ అమితాబ్ విజయశాంతి గామి సినిమాని ప్రశంసిస్తూ మాట్టాడారు. ‘’నేనూ విన్నాను గామి గురించి. అటువంటి సినిమాలు ఆడాలి. ఎంతసేపూ ఒకటే టైపు సినిమాలంటే ఎన్నాళ్ళకి తెలుగు సినిమా స్టయిల్ మారదు. ఈ మధ్యనొచ్చిన కొన్ని సినిమాలు తెలుగు సినిమా రేంజ్ ని బాగా పెంచాయి. గౌరవం తెచ్చాయి. అలాగే గామి సినిమా గురించి చెబుతుంటే విని చాలా ఆనందించాను. న్యూ టాలెంట్ కి ప్రోత్సాహం లభించాలి. అప్పుడే మరిన్ని గొప్ప సినిమాలు రావడానికి మార్గం సుగమం అవుతుంది. ఇండస్ట్రీకి కూడా ఇటువంటి సినిమాలు బాగా ఆడుతుంటే కొత్త ఉత్సాహం వచ్చి, కొత్తకొత్త కథలను ప్రోత్సహిస్తుంది. ఎనీ వే…..కంగ్రాట్స్ టు ది గామి టీమ్’’ అని చెప్పారు.

Lady Amitabh showers praise on Gami

గామి సినిమాని అభినందించనివాళ్ళు లేరు. ఇటీవలి రోజులలో గామికి లభించినన్ని అభినందనలు, ప్రశంసలు మరే సినిమాకి రాలేదంటే అతిశయోక్తి కానేకాదు. ముఖ్యంగా నాలుగేళ్ళపాటు శ్రమించి, ఆ ఇంపాక్ట్ ని తీసుకురావడానికి దర్శకుడు విద్యాధర్, హీరో విష్వక్సేన్ అండ్ ఎంటైర్ టీమ్ చూపించిన అంకితభావం, పట్టుదల వేరే లెవెల్లో ఉండడంతోనే ఇంత గొప్ప అవుట్ పుట్ సాధ్యమైంది. ఊరికే ఓటిటి ఉంది కదా….ఏది తీసినా ఫరవాలేదు, అడినా ఆడకపోయినా ఫరవాలేదు, తర్వాత మెల్లిగా ఏదో ఒక ఓటిటిని పట్టుకుని సొమ్ములు చేసేసుకోవచ్చు అనే బాపతు సినిమాలకి గామి ఒక కనువిప్పు. మేలుకొలుపు. సినిమా అన్నది ఓ కళా రూపం. వ్యాపారమే కావచ్చు. కానీ దానిని ఎంత గొప్పగా చెక్కితే అవార్డులు, రివార్డులు, బాక్సాఫీసు రికార్డులు కూడా ఖాయమనే సూత్రాన్ని గామి నిజం చేసింది. రుజువు చేసింది. అందుకే లేడీ అమితాబ్ లాంటి గ్రేట్ యాక్ట్రస్ కూడా పై విధంగా స్పందించారు. డైరెక్టర్ మారుతి కూడా తన అభినందనలు తెలియజేశారు.