nagidream
దర్శకుడు కృష్ణవంశీ గురించి తెలియని వాళ్ళు ఉండరు. క్రియేటివ్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఒకప్పుడు తన సినిమాలతో ఇండస్ట్రీలో చక్రం తిప్పారు. అలాంటి ఆయన ఇప్పుడు వెనుకబడ్డారు. అయితే ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన అనాథను అయిపోయా అంటూ వెక్కి వెక్కి ఏడ్చేశారు.
దర్శకుడు కృష్ణవంశీ గురించి తెలియని వాళ్ళు ఉండరు. క్రియేటివ్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఒకప్పుడు తన సినిమాలతో ఇండస్ట్రీలో చక్రం తిప్పారు. అలాంటి ఆయన ఇప్పుడు వెనుకబడ్డారు. అయితే ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన అనాథను అయిపోయా అంటూ వెక్కి వెక్కి ఏడ్చేశారు.
nagidream
కృష్ణవంశీ పరిచయం అవసరం లేని దర్శకుడు. ఇండస్ట్రీలో ఈయన చేసిన సినిమాలు ఒక సంచలనం. గులాబీ, సింధూరం, అంతఃపురం సినిమాలే చెబుతాయి ఆయన స్టామినా ఏంటో. హ్యూమన్ ఎమోషన్స్ ని అద్భుతంగా రక్తికట్టించగల సమర్థుడు ఆయన. కుటుంబ బంధాలు, ప్రేమ వంటి ఎలిమెంట్స్ ని చాలా బాగా చూపిస్తారు. తన కథలతో హీరోల ఇమేజ్ ని అమాంతం పెంచుతారు. నాగార్జునకి నిన్నే పెళ్లాడతా, మహేష్ బాబుకి మురారి సినిమాలు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ఈ సినిమాలు కమర్షియల్ గా భారీ విజయాన్ని అందుకున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ గా పేరున్న కృష్ణవంశీకి దేశమంటే అపారమైన భక్తి. భక్తికి తగ్గట్టే తెగువ, ధైర్యం కూడా ఎక్కువే. దానికి ఖడ్గం సినిమానే ఉదాహరణ. సమాజం మీద బాధ్యత, దేశం మీద ప్రేమ వంటివి తన కథల ద్వారా వ్యక్తపరుస్తారు.
అందమైన చందమామ లాంటి ప్రేమకథలు అల్లిన ఆయన, ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా చక్రం తిప్పిన ఆయన కెరీర్ డేంజర్ లో పడినట్టు అయిపోయింది. ఒకప్పుడు కృష్ణవంశీ కథలు ఇప్పుడు రావడం లేదు. రంగమార్తాండ సినిమాతో కొత్తగా ప్రయత్నించినప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేకపోయింది. ఒక మంచి సినిమాని అందించిన ఘనత మాత్రం కృష్ణవంశీకి దక్కింది. ఎప్పుడూ నవ్వించే బ్రహ్మానందం నట విశ్వరూపం చూపించగలిగారంటే అది కృష్ణవంశీ మహిమే. ఇండస్ట్రీలో ఎన్నో హిట్లు, ఎన్నో మంచి కథలు అందించిన ఆయన ఇప్పుడు వెనుకబడిపోయారు. వరుస పరాజయాలను ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ ఈవెంట్ లో వెక్కి వెక్కి ఏడ్చేశారు. ఇండస్ట్రీలో అనాథను అయిపోయానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇండస్ట్రీలో తన పాటలతో చైతన్యం కలిగించిన గొప్ప గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళులుగా ఒక ఈవెంట్ ని నిర్వహించారు. మే 20న ఆయన జయంతి సందర్భంగా ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ పేరుతో ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ లో కృష్ణవంశీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేజ్ మీద ఎమోషనల్ అయ్యారు. సిరివెన్నెల శాస్త్రి గారితో 1989 నుంచి పరిచయం ఉందని.. ఆయన దొరకడం మహా అదృష్టమని అన్నారు. ఏ అర్హత లేకపోయినా తనను కొడుకుగా స్వీకరించారని.. వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్లమని అన్నారు. ఆయన ఉంటే ధైర్యంగా ఉంటుందని, ఆరేడు నెలల నుంచి సినిమా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా అని.. పాటలు ఏం చేయాలో అర్థం కావడం లేదని అన్నారు. ఆయన ఉన్నప్పుడు ఇలాంటి పాటలు ఉంటాయి, ఇలాంటి కథ అని అనుకుని ఆయన దగ్గరకు వెళ్ళేవాడినని అన్నారు. అలాంటిది ఇవాళ అది లేదు. ఒక రకంగా అనాథను అయిపోయాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.