Krishna Kowshik
వివి వినాయక్- మాస్ మహారాజ్ కాంబోలో వచ్చిన మూవీ కృష్ణ. 2008లో వచ్చిన మూవీ ఆ ఏడాది హాయ్యెస్ట్ గ్రాసర్ మూవీ చిత్రాల్లో రెండవదిగా నిలిచింది. ఇక చక్రి అందించిన మ్యూజిక్ హైలెట్. బ్రహ్మానందం కామెడీ నవ్వులు పువ్వులు పూయిస్తుంది. అలాగే విలన్ జక్కా పాత్రలో యాక్ట్ చేసిన నటుడు ఎవరో తెలుసా..?
వివి వినాయక్- మాస్ మహారాజ్ కాంబోలో వచ్చిన మూవీ కృష్ణ. 2008లో వచ్చిన మూవీ ఆ ఏడాది హాయ్యెస్ట్ గ్రాసర్ మూవీ చిత్రాల్లో రెండవదిగా నిలిచింది. ఇక చక్రి అందించిన మ్యూజిక్ హైలెట్. బ్రహ్మానందం కామెడీ నవ్వులు పువ్వులు పూయిస్తుంది. అలాగే విలన్ జక్కా పాత్రలో యాక్ట్ చేసిన నటుడు ఎవరో తెలుసా..?
Krishna Kowshik
మాస్ మహారాజ్, ఎనర్జటిక్ స్టార్ రవితేజ, యాక్షన్ మూవీల దర్శకుడు వివి వినాయక్ కాంబోలో వచ్చిన మూవీ కృష్ణ. 2008లో సంక్రాంతి సమయంలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ ఏడాది హయ్యెస్ట్ కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. రూ. 8 కోట్లు పెట్టి సినిమా తీస్తే.. రూ. 38 కోట్లను వసూలు చేసింది. త్రిష, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, సత్యం రాజేష్, చంద్రమోహన్, సునీల్, రఘుబాబు, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, తనికెళ్ల భరణి, సుధా, వేణుమాధవ్, సనా, కరాటే కళ్యాణి కీ రోల్స్ చేశారు. ఇక ఇందులో యాక్షన్ ఎలిమెంట్స్ ఎంతలా ఆకట్టుకున్నాయో.. కామెడీ కూడా అంతే ఫన్ పుట్టిస్తుంది. ఫస్టాఫ్ నడిపించేది కామెడీనే. ఇక బ్రహ్మానందం-కరాటే కళ్యాణి మధ్య నడిచే రొమాంటిక్ సీన్స్, రవిజతేకు అడ్డంగా దొరికిపోవడం ఫన్ పుట్టిస్తుంటాయి.
బ్రహ్మానందాన్ని ‘బాబీ’అంటూ రవితేజ ఏడిపించే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక ఇందులో పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే. చక్రి అందించినా మ్యూజిక్ కాలు కదపకుండా ఉండలేరు. నీ సోకు మాడా.. అమ్మనో నీ జిమ్మడా, దిల్ మాంగే మోర్, తు మేరా జిల్ జిల్ ఓ ప్రియాతమా, మురిపించే మైనా మైనా, తరత్త ఎత్తుకుపోతా..తరత్త హత్తుకుపోతా, అదరగొట్టు.. కొట్టు సాంగ్స్ ఇప్పటికీ వీణుల విందుగా ఉంటాయి. ఇక ఈ మూవీ హిట్ కొట్టడంతో కన్నడలో రజనీ, బంగ్లాలో ప్రేమ్ ప్రేమ్ పగ్లామీ పేరుతో రీమేక్ అయ్యింది. తమిళం, హిందీ, భోజపురిలో డబ్ చేశారు. ఇక ఇందులో సంధ్య (త్రిష)ను ఇష్టపడే విలన్ జక్కా క్యారెక్టర్ గుర్తుందా..? అతడు ఎవరో ఆ స్టార్ నటుడి సోదరుడని తెలుసా..? ఇంతకు అతడు ఎవరంటే.. ముకుల్ దేవ్.
ముకుల్ దేవ్ ఎవరో కాదు ప్రముఖ స్టార్ విలన్ రాహుల్ దేవ్ తమ్ముడు. మాస్ మూవీతో రాహుల్ దేవ్ క్లిక్ అయితే.. కృష్ణ మూవీతో ఫేమ్ తెచ్చుకున్నాడు ముకుల్ దేవ్. తెలుగులో ముకుల్‌కు ఇదే తొలి సినిమా. ఆ తర్వాత ప్రభాస్-పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఏక్ నిరంజన్, సిద్ధం, నాగార్జున కేడీ, జూనియర్ ఎన్టీఆర్-వివి వినాయక్ బ్లాక్ బస్టర్ మూవీ అదుర్స్, బెజవాడ, మనీ మనీ మోర్ మనీ వంటి చిత్రాల్లో నటించాడు. రవితేజతో కలిసి మరోసారి నిప్పు మూవీలో యాక్ట్ చేశాడు. 2013 నాగార్జున మూవీలో చివరి సారిగా కనిపించాడు ముకుల్ దేవ్. అప్పటి నుండి తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. అన్నలాగే తమ్ముడు కూడా అనేక భాషల్లో వర్క్ చేశాడు.
బాలీవుడ్ పరిశ్రమలో ఆయన కెరీర్ స్టార్ట్ కాగా, తెలుగు, మలయాళం, కన్నడ, పంజాబీ, బెంగాళీ, గుజరాతీ, ఇంగ్లీస్ భాషల్లో నటించాడు. తాజాగా శరభ అనే చిత్రంలో కనిపించాడు కృష్ణ మూవీ విలన్. తెలుగు తెరపై కనిపించి దాదాపు 11 ఏళ్లు అయిపోతుంది. ఇదే క్రమంలో ఇతర ఇండస్ట్రీల్లో అవకాశాలు రావడంతో టాలీవుడ్ పరిశ్రమకు దూరం అయ్యాడు ముకుల్. హీరోలు విలన్లుగా మారిపోతున్న వేళ. . అవకాశాలు తగ్గినట్లు తెలుస్తుంది. మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరిస్తాడేమో చూద్దాం.