P Krishna
Krishna Ghattam Movie OTT Streaming: ఇటీవల ఓటీటీ పుణ్యమా అని కొత్త కొత్త సినిమాలు, అద్భుతమైన వెబ్ సీరీస్ లు చూసే అవకాశం లభిస్తుంది. థియేటర్లో రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే కొత్త సినిమాలు ఓటీటీలో దర్శనమిస్తున్నాయి.
Krishna Ghattam Movie OTT Streaming: ఇటీవల ఓటీటీ పుణ్యమా అని కొత్త కొత్త సినిమాలు, అద్భుతమైన వెబ్ సీరీస్ లు చూసే అవకాశం లభిస్తుంది. థియేటర్లో రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే కొత్త సినిమాలు ఓటీటీలో దర్శనమిస్తున్నాయి.
P Krishna
టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సౌకర్యాలు మరింత పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఆడియన్స్ థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవారు.. కానీ ఇప్పుడు ఓటీటీ లో వస్తున్న కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ ఇంట్లో కూర్చొని హ్యాపీగా చూసే అవకాశం కలుగుతుంది. ఓటీటీలో భారతీయ చిత్రాలు మాత్రమే కాదు ఇతర భాషా చిత్రాలు, వెబ్ సీరీస్ కూడా సందడి చేస్తున్నాయి. కరోనా సమయంలో ధియేటర్లపై అంక్షలు విధించడంతో ఓటీటీకి ప్రాధాన్యత బాగా పెరిగిపోయింది. తమ అభిమాన హీరో సినిమాలు థియేటర్లో మిస్ అయినా.. కొద్ది రోజుల్లోనే ఓటీటీలో సైలెంట్ గా ప్రత్యక్షమవుతున్నాయి. కొంతమంది దర్శక, నిర్మాతలు నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. తాజాగా రెండు నెలల క్రితం రిలీజ్ అయిన కృష్ణఘట్టం మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. వివరాల్లోకి వెళితే..
ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో పాత, కొత్త సినిమాలు మాత్రమే కాదు వెబ్ సీరీస్ కూడా బాగా అలరిస్తున్నాయి. ఇటీవల సినిమా థియేటర్లో రిలీజ్ అయిన కొత్త మూవీలు రెండు నెలల లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. విచిత్రం ఏంటంటే.. థియేటర్లలో హిట్ టాక్ రాకపోయినా.. ఓటీటీలో మాత్రం మంచి సక్సెస్ అవుతున్న చిత్రాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని సినిమాలు డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చినప్పటికీ థియేటర్లో ప్రేక్షకులకు పెద్దగా రీచ్ కాకున్నా.. ఒటీటీలో మంచి స్పందన వస్తుంది. ఇటీవల చిన్న చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఓ సినిమా ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసింది.
మహాభారతం నుంచి స్పూర్తి పొంది తెరకెక్కించిన చిత్రం ‘కృష్ణఘట్టం’. ఈ మూవీలో చైతన్య కృష్ణ, వెంకటకృష్ణ ప్రధాన భూమిక పోషించారు. ఈ మూవీ నవంబర్ 3 న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. కృష్ణఘట్టం.. అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ కాన్సెప్ట్ జనాలకు పెద్దగా ఎక్కలేదు.. అందుకే పబ్లిక్ కూడా లేకుండపోయారు. కథ ఎంపిక బాగున్నప్పటికీ తెరపై దాన్ని ప్రజెంట్ చేసిన విధానంలో దర్శక, నిర్మాత తడబడ్డారని ఇండస్ట్రీ టాక్. స్టేజ్ నాటకాలు వేసే ఓ బ్యాంక్ ఎంప్లాయి, గాలిగా తిరిగే ఓ కుర్రవాడి మధ్య జరిగే కథ. వీరి జీవితాల్లో ఎలాంటి సంఘటనలు జరిగాయి.. చాలా నేచురల్ గా తెరకెక్కించినప్పటికీ ప్రేక్షకులు ఆధరించలేకపోయారు.