iDreamPost
android-app
ios-app

Koratala Siva: ఓ విజన్.. ఓ ప్లానింగ్ కలిపితే కొరటాల! దానికి ‘దేవర’ సాక్ష్యం..

  • Published Aug 18, 2024 | 11:55 AM Updated Updated Aug 18, 2024 | 11:55 AM

ఓ ప్లానింగ్.. ఓ విజన్ కలిపితే కొరటాల శివ అంటూ సినీ విశ్లేషకులు, అభిమానులు పేర్కొంటున్నారు. ఇక దానికి దేవరే సాక్ష్యం అంటూ చెప్పుకొస్తున్నారు. మరి కొరటాల ప్లానింగ్, విజన్ ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.

ఓ ప్లానింగ్.. ఓ విజన్ కలిపితే కొరటాల శివ అంటూ సినీ విశ్లేషకులు, అభిమానులు పేర్కొంటున్నారు. ఇక దానికి దేవరే సాక్ష్యం అంటూ చెప్పుకొస్తున్నారు. మరి కొరటాల ప్లానింగ్, విజన్ ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.

  • Published Aug 18, 2024 | 11:55 AMUpdated Aug 18, 2024 | 11:55 AM
Koratala Siva: ఓ విజన్.. ఓ ప్లానింగ్ కలిపితే కొరటాల! దానికి ‘దేవర’ సాక్ష్యం..

సినిమాను తెరకెక్కించడమే కాదు.. దాన్ని సరిగ్గా ఆడియెన్స్ లోకి తీసుకెళ్లడము కూడా ఓ కళ. ఆ కళ అందరిలో ఉండదు. కానీ.. కొందరు దర్శకులు మాత్రం ఫర్ ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకు సాగుతూ.. తమ సినిమాకు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించేలా చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ మూవీపై భారీ అంచనాలు ఏర్పడి, భారీ ఓపెనింగ్స్ కు దారితీసే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నాడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ. ఓ ప్లానింగ్.. ఓ విజన్ కలిపితే కొరటాల అంటూ సినీ విశ్లేషకులు, అభిమానులు పేర్కొంటున్నారు. ఇక దానికి దేవరే సాక్ష్యం అంటూ చెప్పుకొస్తున్నారు. మరి కొరటాల ప్లానింగ్, విజన్ ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.

కొరటాల శివ.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘మిర్చి’ లాంటి బ్లాక్ బస్టర్ తో ఇండస్ట్రీకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత వరుసగా శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టి పరిశ్రమను తనవైపు చూసేలా చేసుకోవడమే కాకుండా.. స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు. కమర్షియల్ చిత్రాలకు సామాజిక అంశాలను ముడిపెడుతూ.. ఆడియెన్స్ ను ఆలోచింపజేయడంలో కొరటాలది సపరేట్ స్టైల్. శంకర్ లాంటి అతి తక్కువ మంది డైరెక్టర్లు మాత్రమే ఉండే ఈ లిస్ట్ లో కొరటాల శివ కూడా ఉంటాడు.

ఇదిలా ఉండగా.. కొరటాల శివ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘దేవర’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కానీ ప్రమోషనల్ కంటెంట్ ను తారక్ ఫ్యాన్స్ కు, సినీ లవర్స్ కు అందించడంలో మాత్రం కొరటాల ప్లానింగ్, విజన్ అద్భుతమనే చెప్పాలి. ఈ స్టార్ డైరెక్టర్ అప్డేట్స్ ఇవ్వడంలో ముందు నుంచి పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు. పైగా దేవర నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్, కంటెంట్ ఆడియెన్స్ లోకి రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. దేవర ఫియర్ సాంగ్, గ్లింప్ల్స్, చుట్టమల్లే సాంగ్, ఆయుధ పూజ పిక్ తాజాగా వదిలిన సైఫ్ అలీ ఖాన్ ‘భైరా’ ప్రేక్షకుల్లో ఎక్కడా లేని ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాయి.

ఇక అభిమానుల్లో ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా? ఎప్పుడు చూద్దామా? అన్న క్యూరియాసిటీని రేకెత్తించింది. అప్డేట్ కు అప్డేట్ కు మధ్య ఎక్కువ గ్యాప్ ఇస్తే.. ఫ్యాన్స్, ఆడియెన్స్ ఎక్కడ డివియేట్ అవుతారో అని ముందుగానే తన విజన్ తో పసిగట్టిన కొరటాల అందుకు తగ్గట్లుగానే మాసీవ్ అప్డేట్స్ ఇస్తూ.. అభిమానులకు కిక్కిస్తున్నాడు. పైగా దేవరలో ఇంకా ఇవ్వాల్సిన అప్డేట్స్ చాలా ఉన్నాయి. వాటి విషయంలో కొరటాల ఎలా ప్లాన్ చేశాడో అని ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు ఆడియెన్స్. దాంతో ప్రమోషనల్ కంటెంట్, అప్డేట్స్ విషయంలో కొరటాల శివ ప్లానింగ్, విజన్ కు ‘దేవర’ ఓ సాక్ష్యంగా నిలుస్తోందని సినీ విశ్లేషకులతో పాటుగా మూవీ లవర్స్ చెప్పుకొస్తున్నారు. మరి దేవర విషయంలో కొరటాల ప్లానింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio