P Krishna
P Krishna
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ, దర్శక, నిర్మాతలు వారి కుటుంబ సభ్యులు పలు కారణాలతో కన్నుమూస్తున్నారు. సినీ ప్రముఖులు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. వారి అభిమానులు సైతం కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా ప్రముఖ దర్శక, నిర్మాత, నటి మృతితో ఇండస్ట్రీ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళితే..
తమిళ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి, దర్శక నిర్మాత జయదేవి(65) చెన్నైలో తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆమె గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే చికిత్స తీసుకుంటున్న సమయంలోనే కన్నుమూశారు. డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన జయదేవి పలు చిత్రాల్లో నటించింది. తర్వాత దర్శకురాలిగా మారి మలార్, నలమ్ నలమగియ, విలాంగు మీన్, పాశం ఒరువేశం లాంటి చిత్రాలను తెరకెక్కించారు.
నటిగా కొనసాగుతూనే దర్శక, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. నిర్మాతగా నండ్రీ మీండుమ్, మట్రవై నేరిల్, వా ఇంద పక్కమ్ స్టార్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ని ఈమే ఇండస్ట్రీకి పరిచయం చేశారు. జయదేవి మృతి వార్త వినగానే కోలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారే విషాదంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు. ఆమె భౌతిక కాయానికి నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.