iDreamPost
android-app
ios-app

కార్తీ రేంజ్ కి ఇది అవమానమే! గుడ్డిగా నమ్మితే ఇంతే బ్రదర్!

ప్రతి హీరో తన సినిమాలు జీవితంలో గొప్ప జ్ఞాపకాలుగా మిగిలిపోవాలని కోరుకుంటారు. కొందరు హీరోలు కథలను గుడ్డిగా నమ్మి.. సినిమాలు తీస్తారు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకుని తీసిన ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశను కలిగిస్తాయి.

ప్రతి హీరో తన సినిమాలు జీవితంలో గొప్ప జ్ఞాపకాలుగా మిగిలిపోవాలని కోరుకుంటారు. కొందరు హీరోలు కథలను గుడ్డిగా నమ్మి.. సినిమాలు తీస్తారు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకుని తీసిన ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశను కలిగిస్తాయి.

కార్తీ రేంజ్ కి ఇది అవమానమే! గుడ్డిగా నమ్మితే ఇంతే బ్రదర్!

ఏ హీరోకైనా మైలు రాయి సినిమాలు జీవితంలో గొప్ప జ్ఞాపకాలుగా మిగిలిపోవాలని కోరుకుంటారు. కొందరు హీరోలు డైరెక్టర్ ను సినిమాలు తీస్తారు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకుని తీసిన ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ గురి చేస్తుంటాయి. తాజాగా తమిళ హీరో కార్తీ కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్. కారణం.. కార్తీ కూడా 25వ మూవీ జపాన్  తీవ్ర నిరాశకు గురి చేసింది. దర్శకుడు రాజు మురుగన్ ని గుడ్డిగా నమ్మిన వైనం నిండా ముంచేసిందట. ప్రపంచవ్యాప్తంగా ఫైనల్ రన్ ఇంకా దూరముండగానే 25 కోట్ల గ్రాసే అతి కష్టం మీద దాటి ఎదురీదుతోంది.

కార్తీ..సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని హీరో. తెలుగు, తమిళ్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తన నటనతో.. తనకంటూ ప్రత్యేక  ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. కార్తీకి తెలుగులో కూడా భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వెరైటీ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ఈ క్రమంలోనే  తన 25వ సినిమా చాలా ప్రత్యేకంగా ఉండాలని భావించాడు. అందుకే తన 25వ సినిమాను రాజు మురగన్ దర్శకత్వంలో  చేయాలని భావించాడు. ఈ క్రమంలోనే రాజు మురగన్ తెరకెక్కించిన జపాన్ మూవీలో నటించాడు.

అయితే ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన జపాన్ మూవీ అర్థం లేని కథా కథనాలతో, ఏ మాత్రం ఆసక్తి గొలపని స్క్రీన్ ప్లేతో ఆటాడిన తీరు బాక్సాఫీస్ వద్ద తిరస్కారం గురైంది.  ప్రపంచవ్యాప్తంగా ఫైనల్ రన్ ఇంకా దూరముండగానే 25 కోట్ల గ్రాసే అతి కష్టం మీద దాటి ఎదురీదుతోంది. అయితే అదే రోజు పోటీగా వచ్చిన జిగర్ తండా డబుల్ ఎక్స్  కి మార్నింగ్ షోలకు పెద్దగా జనం లేకపోయిన అనూహ్యంగా 50 కోట్ల మార్కుని అందుకుంది.

జపాన్ మూవీ తనకు ఎంతో పేరు తెస్తుందని కార్తీకి భావించాడు. అందుకే  విపరీతమైన ప్రమోషన్లు చేశాడు. అంతేకాక తన అన్నయ్య సూర్యని కూడా పట్టుకొచ్చి మూవీ ప్రమోషన్లు చేశాడు. అంతేకాక తనతో పని చేసిన డైరెక్టర్లను అతిథులుగా తీసుకొచ్చి  గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి ఫుల్ క్రేజ్ పెంచాడు. అంతేకాకతెలుగు వెర్షన్ కోసం హైదరాబాద్ లో నాలుగు రోజులు ఉండి ఈవెంట్లు, ఇంటర్వ్యూలు చేసుకున్నారు. ఇంతగా జపాన్ మూవీ కోసం కష్టపడినా లాభం లేకపోయింది. సినిమాలో కార్తీ మ్యానరిజం తప్ప సినిమా మొత్తంలో పాజిటివ్ గా చెప్పుకునే అంశం ఒక్కటంటే ఒక్కటి లేదని సినీ విశ్లేషకులు అంటున్నారు.

గతంలో ఆయన నటించిన పొన్నియిన్ సెల్వన్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా ఇచ్చిన సంతోషం ఈ విధంగా ఆవిరైందంట. అయితే కథ వినగానే గుడ్డిగా ఓపేసుకుంటే ఎలా బ్రదర్ అంటూ కార్తీకి కొందరు సలహా ఇస్తున్నారు. కథ విన్న తరువాత కాస్తా ఆలోచించి ఉంటే.. ఇంత అవమానం జరిగి ఉండేది కాదు కదా బ్రదర్ అంటూ సలహాలు ఇస్తున్నారు. జపాన్ సినిమా విషయంలో చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు కోలీవుడ్ కంటేటాలీవుడ్ లోనే రెండో వారం కాస్త బెటర్ గా థియేటర్లు రన్ అవుతున్నాయి. ఇలాంటివి కాదు కానీ వీలైనంత త్వరగా ఖైదీ 2తో మరోసారి విశ్వరూపం చూపించమని కార్తీ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.  మరి.. జపాన్ మూవీ విషయంలో కార్తీ గుడ్డిగా వెళ్లడని సోషల్ మీడియాల్లో వస్తున్నవార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.