iDreamPost
android-app
ios-app

దర్శకుడు బాలా.. ఆర్టిస్ట్ లను ఇంతలా కొడతాడా? ఆమ్మో షాకింగ్ వీడియో!

సీన్ ఫరెఫెక్షన్ కోసం నటీనటుల కన్నా ఎక్కువ కృషి చేసేది దర్శకుడు. ప్రతి ఎక్స్ ప్రెషన్ మెగాఫోన్ ద్వారా క్యాప్చర్ చేసి తాను అనుకున్నది అనుకున్నట్లుగా వస్తేనే సీన్ కంప్లీట్ అయ్యేది. లేకుంటే రీటేక్ చెబుతూనే ఉంటాడు. సినిమా కోసం యజ్ఞం చేసే దర్శకుల్లో ఒకరు బాలా.

సీన్ ఫరెఫెక్షన్ కోసం నటీనటుల కన్నా ఎక్కువ కృషి చేసేది దర్శకుడు. ప్రతి ఎక్స్ ప్రెషన్ మెగాఫోన్ ద్వారా క్యాప్చర్ చేసి తాను అనుకున్నది అనుకున్నట్లుగా వస్తేనే సీన్ కంప్లీట్ అయ్యేది. లేకుంటే రీటేక్ చెబుతూనే ఉంటాడు. సినిమా కోసం యజ్ఞం చేసే దర్శకుల్లో ఒకరు బాలా.

దర్శకుడు బాలా.. ఆర్టిస్ట్ లను ఇంతలా కొడతాడా? ఆమ్మో షాకింగ్ వీడియో!

ఓ సినిమా తెరకెక్కాలంటే 24 ఫ్రేమ్స్ అవసరం. ఈ ఫ్రేమ్స్‌ను లీడ్ చేసే కెప్టెన్ దర్శకుడు. సినిమాను తన భుజాలపై మోస్తుంటాడు. చెప్పాలంటే కన్నబిడ్డలా భావిస్తున్నాడు. సాధారణంగా హీరో, హీరోయిన్లు, ఇతర టెక్నీషియన్లు వారి పోర్షన్ పూర్తి కాగానే.. రిలాక్స్ అయిపోతుంటారు. కానీ డైరెక్టర్ అలా కాదు. మూవీ కమిట్ అయ్యాక.. ఎనౌన్స్ మెంట్ నుండి ప్రీ ప్రొడక్షన్ వర్క్, షూటింగ్, నిర్మాణ బాధ్యతలు, పోస్టు ప్రొడక్షన్ వర్క్ అంటూ సతమతమౌతుంటాడు. హిట్ ఆర్ ప్లాప్ హీరోపై ప్రభావితం చూపిస్తుందో లేదో కానీ దర్శకుడి ఫ్యూచర్‌ను డిసైడ్ చేస్తుంది. అందుకే సినిమా కోసం తపస్సే చేస్తుంటాడు. తాను అనుకున్న విధంగా సినిమా వచ్చేందుకు ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్లను రుద్దుతుంటాడు. దీని వల్ల పని రాక్షసుడు అన్న ట్యాగ్ కూడా తగిలించుకుంటాడు దర్శకుడు.

తెలుగులో అలాంటి పేరునే తెచ్చుకున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. సీన్ వచ్చేంత వరకు చెక్కుతూనే ఉంటాడని జక్కన్న అనే పేరు వచ్చింది. అలా తమిళంలో కూడా ఓ దర్శకుడు ఉన్నాడు. ఆయనే ప్రముఖ డైరెక్టర్ బాలా. రియలిస్టిక్ చిత్రాలను తెరకెక్కించే దర్శకుడాయన. సేతు నుండి వనంగాన్ వరకు ఆయన వర్కింగ్ స్టైల్ చూస్తే..తెలుస్తుంది సినిమాపై ఆయనకున్న ఫ్యాషన్ ఏంటో. అలాగే మెగా ఫోన్ పట్టుకుని డైరెక్ట్ చేసే కెప్టెన్ కాదు. ఫీల్ట్‌లోకి దిగి ఎలా యాక్ట్ చేయాలో చూపిస్తుంటాడు.  సీన్‌లో ఇన్వాల్ అయిపోతాడు. మెథడ్ యాక్టింగ్ కోసం తానే నటించి చూపిస్తుంటాడు. కొన్ని సార్లు కోపంలో చేయి చేసుకోవాల్సి వస్తుంది. అదీ కేవలం సీన్ పండటం కోసమే. కానీ అవుట్ పుట్ కోసం ఎంతగానో శ్రమించే దర్శకుల్లో తొలి వరుసలో ఉంటారు. ఇప్పుడు ఆయన వర్కింగ్ స్టైల్ వీడియో ఒకటి బయటకు వచ్చింది.

ఒక సన్నివేశం వచ్చేందుకు ఎంత కష్టపడతాడో.. అలాగే సీన్ సరిగ్గా రాకపోతే ఆర్టిస్టుల తాట ఎలా తీస్తాడో అందులో కనిపిస్తుంది. అగ్రెసివ్ అండ్ టెంపర్ అండ్ డెడికేటెడ్ దర్శకుడు కనిపిస్తున్నాడు ఇందులో. కేవలం సినిమా కోసం యోధుడిగా కస్టపడుతుంటాడు బాలా. 1999 నుండి కొనసాగుతున్నా చేసినవి 10 సినిమాలే అయినా చరిత్రలో నిలిచిపోయిన సినిమాలు తీస్తుంటాడు. కేవలం తమిళ యాక్టర్సే కాదు తెలుగు హీరోలు కూడా ఆయన సినిమాల్లో వర్క్ చేయాలనుకుంటారు. సేతు, నంద, పితామగన్ (శివ పుత్రుడు), నాన్ కదవుల్ (నేనే దేవుణ్ని), అవన్ ఇవన్ (వాడు-వీడు), పరదేశి, నాచియార్ వంటి చిత్రాలు చేశాడు. ప్రస్తుతం వనంగాన్ మూవీని తెరకెక్కిస్తున్నాడు.అరుణ్ విజయ్, రోహ్నీ ప్రకాష్ హీరో హీరోయిన్లు. సముద్ర ఖని, ముస్కిన్, రోబో శంకర్ తదితరులు నటిస్తున్నారు.