iDreamPost
android-app
ios-app

చిరంజీవి ఎత్తుకున్న ఈ పాపని.. ఇప్పుడు చూస్తే నమ్మలేరు

మెగాస్టార్ చిరంజీవి ఎత్తుకున్న ఆ పాప ఎవరో తెలుసా..? ఇండస్ట్రీకి ఆలస్యంగా వచ్చినప్పటికీ.. మంచి పేరు తెచ్చుకుంటుంది. ఎంటర్ ప్రెన్యూయర్ గా రాణిస్తోంది. ఇంతకు ఆమె ఎవరంటే...

మెగాస్టార్ చిరంజీవి ఎత్తుకున్న ఆ పాప ఎవరో తెలుసా..? ఇండస్ట్రీకి ఆలస్యంగా వచ్చినప్పటికీ.. మంచి పేరు తెచ్చుకుంటుంది. ఎంటర్ ప్రెన్యూయర్ గా రాణిస్తోంది. ఇంతకు ఆమె ఎవరంటే...

చిరంజీవి ఎత్తుకున్న ఈ పాపని.. ఇప్పుడు చూస్తే నమ్మలేరు

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎదిగిన హీరోల్లో ఒకరు మెగాస్టార్ చిరంజీవి. డ్యాన్సులకు, పాటలకు, మాటలకు కొత్త పలుకులు నేర్పాడు. తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని దశదిశలా చాటాడు. ఓ తరానికి ఆయనొక స్ఫూర్తి ప్రదాత అనడంలో సందేహం లేదు. ఇండస్ట్రీలోకి హీరోలు అవుదామని వచ్చేవారికి టార్చ్ బేరర్. దర్శక, నిర్మాతలకు అతడొక అక్షయ పాత్రలాంటి హీరో. అతడి మూవీ రిలీజ్ అవుతుందంటే.. థియేటర్ల దగ్గర పెద్ద పెద్ద బ్యానర్లు కట్టాల్సిందే. హంగామా చేయాల్సిందే. తొలి రోజు తొలి షో కోసం క్యూలు కట్టేవారు. లేడీ ఫ్యాన్స్ కూడా ఎక్కువ. ఇప్పుడు సెటిల్ట్ గా సినిమాలు చేస్తూ వస్తున్నారు ఈ దిగ్గజ హీరో. ఈయన కుటుంబం నుండి ఎంతో మంది వారసులు వచ్చిన సంగతి విదితమే.

ఇదిగే ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి కూడా.. అతడ్ని చూస్తూనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తొలి నాళ్లలో కాస్తంత నెగిటివిటీని మూటగట్టుకుని.. ఇప్పుడు సక్సెస్ అయ్యింది. చిరంజీవి ఎత్తుకున్న ఆ పాప ఎవరంటే.. ఆయన ముద్దుల తనయ సుస్మిత కొణిదెల. చిరంజీవి, సురేఖల పెద్ద కుమార్తె. చదువులు పూర్తయ్యాక..లగ్గిశెట్టి విష్ణు ప్రసాద్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీలోకి కాస్ట్యూమ్ డిజైనర్‌గా అడుగుపెట్టింది. తండ్రి, సోదరుడు రామ్ చరణ్ సినిమాలకు వర్క్ చేసింది. ఖైదీ నంబర్ 150, రంగస్థలం, సైరా నరసింహా రెడ్డి, ఆచార్య, వాల్తేరు వీరయ్య చిత్రాలకు ఆమెనే కాస్ట్యూమ్ డిజైనర్. మెల్లిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది.

భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి సినిమాలు, వెబ్ సిరీస్‌లు తెరకెక్కిస్తోంది. తొలుత ఓటీటీ వేదికగా సినిమాలు తెరకెక్కించింది. షూట్ అవుట్ ఎట్ అలేర్ అనే మూవీతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది. ఓటీటీ హీరోగా ముద్ర పడ్డ నరేష్ అగస్త్య, రాజేంద్ర ప్రసాద్, హర్షవర్థన్ ముఖ్య పాత్రల్లో వచ్చిన సేనాపతి మూవీని తెరకెక్కించింది. ఇది ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. 2023లో వచ్చిన శ్రీదేవి, శోభన్ బాబు నిర్మాతగా ఆమెకు తొలి థియేటర్ సినిమా. ఇందులో సంతోష్ శోభన్, గౌరీ కిషన్ హీరో హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఓ వెబ్ సిరీస్ రూపొందించింది సుస్మిత. పరువు అనే వెబ్ సిరీస్ తెరకెక్కించగా.. జీ5లో స్ట్రీమింగ్ అయ్యింది. మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దీనికి సీక్వెల్ కూడా రాబోతుంది. వారసులంతా హీరోయిన్లుగా అవుతుంటే.. సుష్మిత మాత్రం నిర్మాణ రంగాన్ని ఎంచుకుంది. ఇప్పుడు సుస్మిత.. అప్పట్లో ఆమెను అస్సలు గుర్తుపట్టలేకపోతున్నారు కదూ..

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş