Krishna Kowshik
సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు చిత్రంలో వెంకటేశ్- మహేష్ బాబు బామ్మగా నటించిన ఈమె ఎవరో తెలుసా...? ఆమెది మామూలు బ్యాగ్రౌండ్ కాదు. సినిమాలపై మక్కువతో నటనలో శిక్షణ తీసుకున్న ఆమె..
సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు చిత్రంలో వెంకటేశ్- మహేష్ బాబు బామ్మగా నటించిన ఈమె ఎవరో తెలుసా...? ఆమెది మామూలు బ్యాగ్రౌండ్ కాదు. సినిమాలపై మక్కువతో నటనలో శిక్షణ తీసుకున్న ఆమె..
Krishna Kowshik
వెంకటేశ్- మహేష్ బాబు మల్టీ స్టారర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. అంజలి, సమంత హీరో హీరోయిన్లు. 2013లో శ్రీకాంత్ అడ్డాలా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఇందులో ప్రకాష్ రాజ్, జయసుధ, రావు రమేష్, రమా ప్రభ, ఆహుతి ప్రసాద్ వంటి స్టార్ట్ కాస్ట్ నటించారు. ఇందులో వెంకీ, మహేష్ బాబుకు బామ్మగా అలరించిన నటి గుర్తుందా.. ‘ హు..సరిపోయారు ఇద్దరూను.. సాగుతుంది మీకలాగా’ అంటూ ఇద్దరు మనవళ్లనుద్దేశించి ఆమె చెప్పై డైలాగ్ పటాసులా పేలింది.. ఇప్పుడు ఆమె డైలాగ్‌ను క్యాష్ చేసుకుంటున్నారు మీమర్స్. రోహిణీ ఈ సినిమాతో పాపులర్ అయినప్పటికీ.. ఎన్నో ఏళ్ల నుండి ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఆమె బ్యాగ్రౌండ్ మామాలుది కాదు.
మహారాష్ట్రలోని పూణెలో పుట్టిన ఆమె.. నటనపై ఆసక్తితో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో శిక్షణ తీసుకున్నారు. అక్కడే ఆమెకు పరిచయం అయ్యారు ఆమె భర్త జయదేవ్ హట్టంగడి. శిక్షణ తీసుకున్న ఈ ఇద్దరు.. ఆ తర్వాత ఏడాది వివాహం చేసుకున్నారు. జయదేవ్ డైరెక్షన్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఆమె నటన పట్లే కాదు..భారతీయ శాస్త్రీయ నృత్య రూపాలు, కథాకళి, భరతనాట్యంలో ఎనిమిది సంవత్సరాలకు పైగా శిక్షణ పొందారు. పెళ్లి తర్వాత థియేటర్ గ్రూప్ ఏర్పాటు చేసి.. 150కి పైగా ప్రదర్శనలు ఇచ్చారు రోహిణీ. అలా థియేటర్ రంగంలో ఎన్నో అవార్డులు తీసుకున్నారు. అలా 1978లో అరవింద్ దేవాయ్ కీ అజీబ్ దస్తాన్ అనే హిందీ చిత్రంలో తెరంగేట్రం అయ్యారు ఈ సీనియర్ నటీమణి. ఆమెకు పేరు తెచ్చిన మూవీ గాంధీ. అలా హిందీలో ఫేమ్ తెచ్చుకుంది. సూపర్ క్యారెక్టర్స్ చేసింది.
ఆమె తెలుగులో నటించిన తొలి చిత్రం నాగేశ్వరరావు, మీనా ప్రధాన పాత్రలో నటించిన సీతారామయ్యగారి మనవరాలు. ఇందులో నాగేశ్వరరావు భార్యగా, జానకమ్మగా.. భర్తకు అడ్డు చెప్పని భార్యగా మెప్పించింది. తల్లి క్యారెక్టర్లు వేయాల్సిన వయస్సులో అమ్మమ్మ పాత్రలో నటించింది. రామ్ గోపాల్ వర్మ రాత్రి మూవీలో రేవతికి తల్లిగా కనిపించింది. ఇక అప్పటి నుండి తెలుగులో సినిమాలు చేస్తూనే ఉంది ఆవిడ. బాలయ్య టాప్ హీరో, లిటిట్ సోల్జర్స్ చేశాక సుమారు 15 ఏళ్లు తెలుగు ఇండస్ట్రీలో కనిపించలేదు ఈ నటి. 2012లో వచ్చిన షిరిడీ సాయితో రీఎంట్రీ ఇచ్చిన ఆమె.. వరుసగా చిత్రాలు చేసింది. రామయ్య వస్తావయ్యాలో బేబిగా జూనియర్ ఎన్టీఆర్‌తో నటించింది. బ్రహోత్సవం, చల్ మోహన్ రంగా, చిత్రలహరి, తాాజాగా వచ్చిన ఫ్యామిలీ స్టోరీలో కనిపించింది. కాగా, ఈ మధ్య వచ్చిన మరాఠి చిత్రం బైపన్ బారీ దేవ్ చిత్రంలో ఆమె మెయిన్ లీడ్ చేయడం విశేషం. ఆరుగురు అక్కా చెల్లెళ్ల కథే. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రోహిణీ మేడమ్ భర్త 2008లో మరణించారు. ఆమెకు ఓ కొడుకు అసీమ్ హట్టంగడి అనే కొడుకు ఉన్నాడు.