iDreamPost
android-app
ios-app

ఖైదీ మూవీ నెపోలియన్ గురించి ఈ విషయాలు తెలుసా..?

లోకేశ్ కనగరాజ్- కార్తీ కాంబోలో వచ్చిన చిత్రం ఖైదీ. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు వచ్చింది. అలాగే కానిస్టేబుల్ నెపోలియన్ రోల్లో కనిపించిన నటుడికైతే డబుల్ రెస్పాన్స్ వచ్చింది. మరీ ఈ నటుడు గురించి ఈ విషయాలు తెలుసా..?

లోకేశ్ కనగరాజ్- కార్తీ కాంబోలో వచ్చిన చిత్రం ఖైదీ. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు వచ్చింది. అలాగే కానిస్టేబుల్ నెపోలియన్ రోల్లో కనిపించిన నటుడికైతే డబుల్ రెస్పాన్స్ వచ్చింది. మరీ ఈ నటుడు గురించి ఈ విషయాలు తెలుసా..?

ఖైదీ మూవీ నెపోలియన్ గురించి ఈ విషయాలు తెలుసా..?

కోలీవుడ్ యంగ్ డైరెక్టర్లలో ఒకరు లోకేశ్ కనగరాజ్. కేవలం ఐదు చిత్రాలతో స్టార్ డైరెక్టర్‪గా మారాడు. రెండో చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఈ యంగ్ తరంగ్. ఆ సినిమానే ఖైదీ. 2019లో విడుదలైన మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రూ. 25 కోట్ల పెట్టి సినిమా తీస్తే.. రూ. 105 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది . ఇందులో కార్తీ, అర్జున్ దాస్‌, సునీల్ పాత్రలో పాటు మరొకరికి మంచి గుర్తింపు వచ్చింది. అతడే పోలీస్ కానిస్టేబుల్ నెపోలియన్. ఇందులో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆయన కెరీర్ ఖైదీకి ముందు ఖైదీకి తర్వాత అన్నట్లుగా మారిపోయింది. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) భాగంగా లియోలో కూడా అదే పాత్రలో మెరిశాడు. విజయ్ కనిపించినప్పుడు థియేటరల్లో ఎలా అయితే విజిల్స్ వేశారో.. ఈయన కనిపించకగానే అలాగే విజిల్స్ వేశారు ఆడియన్స్.

చాలా మందికి ఈ నటుడు కానిస్టేబుల్ నెపోలియన్ పాత్రలోనే గుర్తిండిపోతాడు.. ఆయన అసలు పేరు జార్జ్ మేరియన్. ఆయన ఎన్నో ఏళ్ల నుండి తమిళ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. సినిమాల్లోకి రాకముందు ఆయన థియేటర్ ఆర్టిస్ట్. జార్జ్ 1989 నుండి థియేటర్ నటుడిగా కెరీర్ స్టార్ట్ చేశారు. సుమారు 13 ఏళ్ల పాటు ఎన్నో నాటకాలు వేశాడు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. సపోర్టింగ్ రోల్స్ ఆ తర్వాత కమెడియన్‌గా మారి నవ్వులు, పువ్వులు పూయించాడు. 2002 నుండి కెరీర్ కొనసాగుతున్న ఆయనకు గుర్తింపునిచ్చిన పాత్ర కాంచీవరం. ఇందులో దొంగ పోలీసాఫీసర్‌గా నటించి మెప్పించాడు. అక్కడ నుండి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

ప్రియదర్శన్, ఎఎల్ విజయ్, శివ, మణికందన్, లోకేష్ కనగరాజ్, తంగర్ బచ్చన్, సుందర్ సి వంటి స్టార్ దర్శకులతో వర్క్ చేశాడు. మద్రాస్ పట్టణం, దైవ తిరుమగల్, శైవం వంటి చిత్రాల్లో మంచి క్యారెక్టర్స్ పోషించాడు. కానీ అతడికి గుర్తింపునిచ్చిన పాత్ర మాత్రం ఖైదీ మూవీలోని కానిస్టేబుల్ నెపోలియన్. ఎంతలా పేరొచ్చిందంటే. రియల్ నేమ్ మర్చిపోయేలా. అంతేనా ఆఫర్స్ కూడా వెల్లువలా వచ్చాయి. గతం కన్నా మంచి రోల్స్ ఆయన్ను పలకరించడం స్టార్ట్ చేశాయి. గత ఏడాది విడుదల లోకేశ్ కనగరాజ్ మూవీ లియోలో కూడా కానిస్టేబుల్ నెపోలియన్ పాత్రలో మెప్పించాడు. దీంతో ఖైదీకి, లియోకి సంబంధం ఉందని గెస్ చేశారు ప్రేక్షకులు. ఆయన తెలుగులో కూడా నటించాడు. యాత్ర 2లో కనిపించాడు. అలాగే మంజుమ్మల్ బాయ్స్ చిత్రంలో కూడా ఓ బడ్డీ కొట్టు యజమానిగా యాక్ట్ చేశాడు. తాజాగా ఇండియన్ 2లో కనిపించాడు. ప్రస్తుతం ఆయన చేతిలో పలు సినిమాలున్నాయి. కానీ ఆయన కెరీర్ మలుపు తిప్పినవి.. పోలీస్ పాత్రలే కావడం గమనార్హం.

 

View this post on Instagram

 

A post shared by George maryan (@georgemaryan_official)