iDreamPost
android-app
ios-app

రిలీజ్ వాయిదా వేసుకున్న ‘రూల్స్ రంజన్’! కొత్త డేట్ ఏదంటే..

  • Author ajaykrishna Published - 04:09 PM, Tue - 12 September 23
  • Author ajaykrishna Published - 04:09 PM, Tue - 12 September 23
రిలీజ్ వాయిదా వేసుకున్న ‘రూల్స్ రంజన్’! కొత్త డేట్ ఏదంటే..

టాలీవుడ్ లో రిలీజ్ డేట్స్ హడావిడి ఇంకా సద్దుమణగలేదు. సెప్టెంబర్ 28 నుండి సలార్ ఎప్పుడైతే వాయిదా పడిందో.. ఆ డేట్ ని కైవసం చేసుకునేందుకు చాలా సినిమాలే పోటీ పడ్డాయి. అందులో స్కంద, చంద్రముఖి 2 లాంటి పెద్ద సినిమాలతో పాటు పెదకాపు, రూల్స్ రంజన్ లాంటి చిన్న సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. సలార్ ఏమంటా సైలెంట్ గా పోస్టుపోన్ అయ్యిందో.. వెంటనే సెప్టెంబర్ రిలీజ్ ల విషయంలో గందరగోళం మొదలైంది. సలార్ వస్తుందని రెండు వారాల ముందే ప్లాన్ చేసుకున్న సినిమాలు.. ఒక్కొక్కటిగా సలార్ డేట్ కి షిఫ్ట్ అయిపోయాయి.

కట్ చేస్తే.. సలార్ టైమ్ లో రిలీజ్ కి నాలుగు సినిమాలు సెట్ అయ్యాయి. రామ్ – బోయపాటిల స్కంద, లారెన్స్ చంద్రముఖి 2.. ఈ రెండు సెప్టెంబర్ 28న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్నాయి. అదే రోజు కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజన్ కూడా ఫిక్స్ అయ్యింది. ఆ తర్వాత రోజు అంటే.. సెప్టెంబర్ 29న పెదకాపు రిలీజ్ అవుతోంది. ఓకే ఈసారి మంత్ ఎండ్ గట్టిగా సెట్ అయ్యింది.. తెలుగులో నాలుగు సినిమాల హవా ఉంటుందని.. ఏది నిలబడుతుందో చూడాలని ఆసక్తి ఏర్పడింది. ఇంతలో కిరణ్ అబ్బవరం.. రూల్స్ రంజన్ మూవీ సలార్ డేట్ నుండి తప్పుకుని షాక్ ఇచ్చింది.

రూల్స్ రంజన్.. సెప్టెంబర్ 28 నుండి వాయిదా పడింది. సాంగ్స్ ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా.. ఓ వారం వాయిదా పడి.. అక్టోబర్ 6న రిలీజ్ అవుతున్నట్లు తాజాగా మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో స్కంద, చంద్రముఖి 2, పెదకాపు సినిమాల బిగ్ వార్ నుండి తప్పుకుందని అంటున్నాయి సినీ వర్గాలు. మొత్తానికి రూల్స్ రంజన్ ఎప్పుడు వచ్చినా ఆదరించేందుకు రెడీ అంటున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ కాగా.. సినిమాని రధినం కృష్ణ తెరకెక్కించాడు. మూవీని స్టార్ లైట్ సినిమాస్ వారు నిర్మించగా.. ఏఎం రత్నం సమర్పణలో సినిమాని రిలీజ్ చేస్తున్నారు. మరి రూల్స్ రంజన్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş