iDreamPost
android-app
ios-app

Sekhar master: కిరాక్ బాయ్స్- ఖిలాడీ గర్ల్స్ ప్రోమో! శేఖర్ మాస్టర్ చుట్టూ చేతులు వేస్తూ!

  • Published Aug 14, 2024 | 3:21 PM Updated Updated Aug 14, 2024 | 3:21 PM

కిరాక్ బాయ్స్- ఖిలాడీ గర్ల్స్ లేటెస్ట్ ప్రోమో తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో లేడీ గ్యాంగ్ శేఖర్ మాస్టర్ చుట్టూ చేతులు వేస్తూ.. చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

కిరాక్ బాయ్స్- ఖిలాడీ గర్ల్స్ లేటెస్ట్ ప్రోమో తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో లేడీ గ్యాంగ్ శేఖర్ మాస్టర్ చుట్టూ చేతులు వేస్తూ.. చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

  • Published Aug 14, 2024 | 3:21 PMUpdated Aug 14, 2024 | 3:21 PM
Sekhar master: కిరాక్ బాయ్స్- ఖిలాడీ గర్ల్స్ ప్రోమో! శేఖర్ మాస్టర్ చుట్టూ చేతులు వేస్తూ!

బుల్లితెరపై ఎన్నో షోలు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. లేటెస్ట్ గా ‘స్టార్ మా’లో కిరాక్ బాయ్స్-ఖిలాడీ గర్ల్స్ అనే షో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ షోకి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తుండగా.. అనసూయ భరద్వాజ్, శేఖర్ మాస్టర్ లు మెంటర్, జడ్జీలుగా చేస్తున్నారు. లేడీ గ్యాంగ్ కు అనసూయ, బాయ్స్ కు శేఖర్ మాస్టర్ లు మెంటర్ గా ఉన్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో శేఖర్ మాస్టర్ చుట్టూ చేతులు వేస్తూ.. ఊపిరి ఆడకుండా చేశారు లేడీ కంటెస్టెంట్స్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

కిరాక్ బాయ్స్-ఖిలాడీ గర్ల్స్ లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో బాయ్స్-గర్ల్స్ కు హ్యాండ్ రెజ్లింగ్ పోటీ పెట్టింది యాంకర్ శ్రీముఖి. అందులో భాగంగా.. లేడీస్ నుంచి ఆయేషా(ఉర్వశివో రాక్షసివో సీరియల్ హీరోయిన్) రాగా.. బాయ్స్ నుంచి ఫణీ వచ్చాడు. ఇద్దరు చేతి కుస్తీ పడుతుండగా.. మధ్యలో దీపిక రంగరాజు (కావ్య) ఎంట్రీ ఇచ్చింది. ఫణిని రొమాంటిక్ గా డిస్ట్రబ్ చేసింది. ఆమె రొమాన్స్ ను అతడు తట్టుకోలేక నేను ఓడిపోయాను అంటూ పక్కకి వెళ్లిపోయాడు.

Sekhar Master

ఈ క్రమంలో బాయ్స్ మెంటర్ శేఖర్ మాస్టర్ రంగంలోకి దిగగా.. అటువైపు అనసూయ హ్యాండ్ రెజ్లింగ్ కు సిద్ధమైంది. ఇద్దరు కుస్తీ పడుతుండగా.. లేడీ గ్యాంగ్ మెుత్తం వచ్చేసి.. మీద పడుతూ.. బుగ్గలు గిల్లుతూ శేఖర్ మాస్టర్ ను డిస్ట్రబ్ చేశారు. ఆ లేడీ గ్యాండ్ డిస్ట్రబ్ ను తట్టుకోలేక మాస్టర్ పారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా.. ఎప్పటిలాగే కంటెస్టెంట్స్ తమ టాలెంట్ తో ఇరగదీశారు.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet