Krishna Kowshik
హ్యాపీడేస్ తర్వాత కాలేజ్ ప్రేమ కథలతో ఆకట్టుకున్న మూవీ కేరింత. ఇందులో సుమంత్ అశ్విన్, దివ్యతో పాటు కొత్త వాళ్లు నటించారు. ఇందులో నూకరాజు, భావన మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇంతకు ఆ భావన ఎలా ఉందో తెలుసా..?
హ్యాపీడేస్ తర్వాత కాలేజ్ ప్రేమ కథలతో ఆకట్టుకున్న మూవీ కేరింత. ఇందులో సుమంత్ అశ్విన్, దివ్యతో పాటు కొత్త వాళ్లు నటించారు. ఇందులో నూకరాజు, భావన మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇంతకు ఆ భావన ఎలా ఉందో తెలుసా..?
Krishna Kowshik
దిల్ మూవీతో హిట్ అందుకుని ప్రముఖ నిర్మాతగా మారిపోయాడు దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ఎన్నో హిట్ చిత్రాలను అందించాడు. తెలుగు ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ అయ్యాడు. అయితే ఆయన స్టార్ హీరోలతో సినిమాలు చేసినట్లే.. కొత్త వాళ్లతో కూడా సినిమాలు తెరకెక్కించి హిట్ కొట్టాడు. అటువంటి చిత్రాల్లో ఒకటి కేరింత. 2015లో వచ్చిన ఈ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో సుమంత్ అశ్విన్, శ్రీ దివ్య మెయిన్ హీరో హీరోయిన్లుగా నటించారు. విశ్వంత్, తేజస్వి మదివాడ, పార్వతీశం, సుకృతి అంబటి నటించారు. వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు చిత్రాలతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సాయి కిరణ్ అడవి డైరెక్టర్. ఈ సినిమాను కూడా కాలేజీ, ఫ్రెండ్ షిప్, లవ్ స్టోరీతో అందంగా తీర్చిదిద్దాడు.
మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు. ఇందులో పాటలన్నీ సూపర్ డూపర్‌గా నిలిచాయి. ‘స్వరంలో ఆగిందే కేరింత, ఏ కథ ఎటు పోతుందో’ పాటలు వీనుల విందుగా అనిపిస్తుంటాయి. ఇక ఇందులో ఫన్నీగా అనిపించే క్యారెక్టర్ నూకరాజు. అతడికి పెయిర్‌గా నటించింది భావన. ఈ ఇద్దరి కాంబోలో సీన్స్ చాలా ఫన్నీగా, కొత్తగా ఉంటాయి. ఈ మూవీలో నీ గోల్ ఏంటీరా..? గోల గోల ఏంటీ అంటూ అమాయకంగా నటిస్తాడు నూకరాజు క్యారెక్టర్ చేసిన పార్వతీశం. అతడు మోసపోవద్దని, బాగా చదువుకోవాలని చెబుతూ ఉంటుంది భావన. ఆమె అతడ్ని ప్రేమిస్తూ.. బయటకు చెప్పదు.. కానీ చివరకు ఆమె ప్రేమను గుర్తిస్తాడు నూకరాజు. అప్పటికి తన ఊరు వెళ్లిపోయేందుకు సిద్దమౌతుంది. అప్పుడు భావన.. వెళ్లిపోకే అంటూ తనను మెప్పించేందుకు ప్రయత్నిస్తాడు. ఇందులో భావన క్యారెక్టర్‌లో చేసిన అమ్మాయి ఎవరో తెలుసా… సుకృతి అంబటి.
ఈ సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది సుకృతి అంబటి. అయితే ఈ అమ్మాయికి వరుస అవకాశాలు వస్తాయని అనుకున్నారని కానీ.. చదువులు నిమిత్తం ఆమె దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు అమ్మాయి అయినప్పటికీ.. ఢిల్లీలో పెరిగింది. ఆమె తండ్రిది నెల్లూరు జిల్లా, కావలి. ఆయన ఉద్యోరీత్యా (సివిల్ ఇంజనీర్) ఏళ్ల క్రితం ఢిల్లీలో స్థిరపడ్డారు. ఢిల్లీలోని కలుచిహన్స్ రాజ్ మోడల్ పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తిచేసింది. రాజస్థాన్‌లోని బనస్తలి విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చదివింది. సుకృతికి చిన్నప్పటి నుండి డాన్స్ ఇష్టం. డ్యాన్స్, నాటకాల్లో నటించేది. ఈ సినిమాతో మళ్లీ కనిపించలేదు ఈ నటి. అయితే ఇటీవల పెళ్లి చేసుకునే ఫ్యామిలీ లైఫ్‌లోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంది.