iDreamPost
android-app
ios-app

Puri Jagannadh-Charmy Kaur: డబుల్ ఇస్మార్ట్ కు రూట్ క్లియర్.. పూరి, ఛార్మికి బిగ్ రిలీఫ్!

  • Published Jul 26, 2024 | 4:59 PM Updated Updated Jul 26, 2024 | 4:59 PM

డబుల్ ఇస్మార్ట్ మూవీ రిలీజ్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురౌతామని అందరూ భావించారు. కానీ ఆ విషయంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్-ఛార్మి కౌర్ లకు బిగ్ రిలీఫ్ లభించింది. ఆ వివరాల్లోకి వెళితే..

డబుల్ ఇస్మార్ట్ మూవీ రిలీజ్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురౌతామని అందరూ భావించారు. కానీ ఆ విషయంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్-ఛార్మి కౌర్ లకు బిగ్ రిలీఫ్ లభించింది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 26, 2024 | 4:59 PMUpdated Jul 26, 2024 | 4:59 PM
Puri Jagannadh-Charmy Kaur: డబుల్ ఇస్మార్ట్ కు రూట్ క్లియర్.. పూరి, ఛార్మికి బిగ్ రిలీఫ్!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ టాలీవుడ్ కి ఎన్నో హిట్లు అందించాడు. పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇవ్వడమే కాకుండా.. ట్విస్టులను పెట్టడంలో సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టాడు. అయితే గత కొంత కాలంగా పూరికి కలిసి రావడం లేదు. విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించిన ‘లైగర్’ డిజాస్టర్ గా నిలవడంతో పాటుగా నష్టాలను మిగిల్చింది. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ ద్వారా ఛార్మితో కలిసి నిర్మించాడు పూరి. ఈ మూవీతో ఎగ్జిబీటర్లు, డిస్ట్రిబ్యూటర్లు చాలా నష్టపోయారు. అయితే ఈ ప్రభావం డబుల్ ఇస్మార్ట్ మూవీపై పడుతుందని అంతా భావించారు. కానీ ఈ విషయంలో డాషింగ్ డైరెక్టర్ కి, ఛార్మికి బిగ్ రిలీఫ్ దక్కినట్లు సమాచారం.

పూరి జగన్నాథ్-రామ్ పోతినేని కాంబోలో వస్తున్న మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. ఇందులో రామ్ కు జోడీగా కావ్యా థాపర్ నటిస్తోంది. పూరి కనెక్ట్స్ పై ఛార్మి-పూరి జగన్నాథ్ లు సంయుక్తంగా నిర్మించారు. ఆగస్ట్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. అయితే అందరూ ఈ మూవీ విడుదలకు కొన్ని అడ్డంకులు ఏర్పడతాయని భావించారు. లైగర్ మూవీ డిజాస్టర్ కావడంతో.. డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు నష్టాలు వచ్చాయి. మరీ ముఖ్యంగా నైజం ఏరియా డిస్ట్రీబ్యూటర్ వరంగల్ శ్రీనుకు ఈ మూవీతో భారీ నష్టాలు వచ్చాయి. దాంతో కొంత డబ్బు తిరిగి ఇవ్వాలని అప్పట్లో ఆయన మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

తాాజాగా ఈ విషయంలో పూరి-ఛార్మిలకు రిలీఫ్ లభించినట్లు తెలుస్తోంది. ఫిల్మ్ ఛాంబర్ కు చేరిన ఈ వ్యవహారంలో.. లైగర్ నష్టాలతో తమకు సంబంధం లేదని అగ్రిమెంట్ లోనే ఉందని ఈ జోడీ ఛాంబర్ కు ఆధారాలు సమర్పించింది. దాంతో పూరి-ఛార్మిల డబుల్ ఇస్మార్ట్ మూవీని ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టడానికి వీలు లేదని ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది. ఇక డబుల్ ఇస్మార్ట్ నుంచి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ మాస్ ఆడియెన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. స్టెప్పా మార్ కంటే హై రేంజ్ లో మార్ ముంతా.. చోడ్ చింతా సాంగ్ దుమ్మురేపుతోంది. ఈ రెండు సాంగ్స్ మూవీపై విపరీతమైన హైప్ ను తీసుకొచ్చాయి. ఇక ఊహించని రేంజ్ లో డబుల్ ఇస్మార్ట్ కు బిజినెస్ జరిగింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet