కీడా కోలా మూవీ టీమ్ ప్రేక్షకులకు ఓ బంపరాఫర్ ను ప్రకటించింది. మల్టీప్లెక్స్ ల్లో అతి తక్కువ ధరకే సినిమా చూసే అవకాశాన్ని కల్పించింది.
కీడా కోలా మూవీ టీమ్ ప్రేక్షకులకు ఓ బంపరాఫర్ ను ప్రకటించింది. మల్టీప్లెక్స్ ల్లో అతి తక్కువ ధరకే సినిమా చూసే అవకాశాన్ని కల్పించింది.
మూవీ లవర్స్ ను సర్ప్రైజ్ చేస్తూ అప్పుడప్పుడు ఊహించని ఆఫర్లు ఇస్తూ ఉంటారు మూవీ మేకర్స్. అదీకాక జాతీయ సినిమా దినోత్సవం నాడు టికెట్లపై ఆఫర్లు ప్రకటించడం మనకు తెలిసిన విషయమే. ఇంతకు ముందు కూడా కొన్ని సినిమా యూనిట్స్ తమ మూవీకి సంబంధించి టికెట్లపై డిస్కౌంట్స్ ప్రకటించాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి వచ్చి చేరింది ‘కీడా కోలా’. టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించి.. నటించాడు. మరి ఈ సినిమా బృందం ప్రేక్షకులకు ఇచ్చిన ఆఫర్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
‘కీడా కోలా’ తరుణ్ భాస్కర్ డైరెక్షన్ చేసి.. నటించిన సినిమా ఇది. ఈ మూవీలో చైతన్య రావు, బ్రహ్మానందం, జీవన్ ప్రముఖ పాత్రల్లో నటించారు. ఈ నెల 3వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫుల్ లెంత్ కామెడీతో ఈ సినిమాను తెరకెక్కించాడు తరుణ్ భాస్కర్. ప్రస్తుతం థియేటర్ల దగ్గర కొంత సందడి తగ్గడంతో.. ప్రేక్షకులకు ఓ భారీ ఆఫర్ ను ప్రకటించింది మూవీ టీమ్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కీలా కోడా సినిమాను మల్టీప్లెక్స్ ల్లో కేవలం రూ. 112కే చూడొచ్చని తెలిపింది.
అయితే ఈ ఆఫర్ కు షరతులు వర్తిస్తాయని, రెక్లైనర్స్ కు ఇది వర్తించదని చెప్పింది. దీకాక కేవలం తెలంగాణలోని మల్టీప్లెక్స్ ల్లో మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని అది కూడా ఈ బుధవారం నుంచి శుక్రవారం వరకు దీనిని వినియోగించుకోవాలని పేర్కొంది. ఇక ఈ మూవీకి టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరించారు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ సినిమాను చూడని వారు ఎంచక్కా మల్టీప్లెక్స్ లో తక్కువ రేటుకే మూవీని చూసేయండి.
ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే.. వాస్తు(చైతన్యరావు), అతడి తాత వరదరాజు(బ్రహ్మానందం) అడ్వకేట్ అయిన కౌశిక్(రాగ్ మయూర్) వీళ్ల ముగ్గురి ఆశయం ఒక్కటే డబ్బు సంపాదించడం. తాత కోసం కొన్న కూల్ డ్రింక్ కీడా కోలా సీసాలో వచ్చిన బొద్దింకని చూపించి.. యజమాని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూల్ చేయాలని వీరి ప్లాన్. రూ. 5 కోట్ల నుంచి బేరాలు మెుదలవుతాయి. ఇంతలో కార్పోరేటర్ కావాలనుకున్న జీవన్ అతడి తమ్ముడు నాయుడు(తరుణ్ భాస్కర్) లు కూడా ఈ డబ్బు కోసం రంగంలోకి దిగుతారు. ఈ రెండు గ్యాంగ్స్ ఎలా కలిశారు? కీడా కోలా సీసాలోకి బొద్దింక ఎలా వచ్చింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.