iDreamPost
android-app
ios-app

Karthi, Sardar 2: మిషన్ ప్రారంభించిన కార్తీ.. ఈసారి అంతకు మించి!

  • Published Jul 12, 2024 | 2:05 PM Updated Updated Jul 12, 2024 | 2:20 PM

కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సర్దార్. మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇక ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి వస్తున్నారు.

కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సర్దార్. మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇక ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి వస్తున్నారు.

  • Published Jul 12, 2024 | 2:05 PMUpdated Jul 12, 2024 | 2:20 PM
Karthi, Sardar 2: మిషన్ ప్రారంభించిన కార్తీ.. ఈసారి అంతకు మించి!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ చిత్రాలకు సీక్వెల్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా? అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలా ఆడియెన్స్ క్యూరియాసిటీతో ఎదురుచూసే ఓ మూవీ సీక్వెల్ స్టార్ట్ అయ్యింది. కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సర్దార్. మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేసింది ఈ చిత్రం. తాజాగా సర్దార్ 2 పూజా కార్యక్రమం జరిగింది. ఇందుకు సంబంధించిన స్టిల్స్ వైరల్ గా మారాయి.

సర్ధార్.. కార్తీ-పీఎస్ మిత్రన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ వస్తోంది. మిషన్ కాంబోడియా నేపథ్యంలో సాగే సర్ధార్ 2 మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న యూనిట్.. జూలై 15 నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరగనున్నట్లు పేర్కొంది. తొలుత చెన్నైలో వేసిన భారీ సెట్ లో షూటింగ్ పూర్తి చేసుకుని, ఆ తర్వాత కథానుగుణంగా కజకిస్తాన్, అజర్ బైజాన్, జార్జియాలో మిగిలిన షూటింగ్ కంప్లీట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. అమిగోస్ బ్యూటీ ఆషికా రంగనాథన్ ఇందులో కీలకపాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సర్దార్ 2 ప్రారంభం అయ్యిందని తెలియడంతో కార్తీ ఫ్యాన్స్ తో పాటుగా సగటు సినీ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ మూవీ థియేటర్లలోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. మరి సర్దార్ 2 కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabet