iDreamPost
android-app
ios-app

అమితాబ్, షారుఖ్ లకు ధీటుగా.. లగ్జరీ ఫ్లాట్ కొన్న స్టార్ హీరోయిన్!

  • Published Jul 12, 2024 | 1:00 PM Updated Updated Jul 12, 2024 | 1:00 PM

అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ లాంటి ప్రముఖులు కొన్న దగ్గరే ఓ లగ్జరీ ఫ్లాట్ ను కొనుగోలు చేసింది స్టార్ హీరోయిన్. అతి తక్కువ మంది బాలీవుడ్ బిగ్ షాట్స్ కే అక్కడ ఖరీదైన ఫ్లాట్స్ ఉన్నాయి. ఆ హీరోయిన్ ఎవరంటే?

అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ లాంటి ప్రముఖులు కొన్న దగ్గరే ఓ లగ్జరీ ఫ్లాట్ ను కొనుగోలు చేసింది స్టార్ హీరోయిన్. అతి తక్కువ మంది బాలీవుడ్ బిగ్ షాట్స్ కే అక్కడ ఖరీదైన ఫ్లాట్స్ ఉన్నాయి. ఆ హీరోయిన్ ఎవరంటే?

  • Published Jul 12, 2024 | 1:00 PMUpdated Jul 12, 2024 | 1:00 PM
అమితాబ్, షారుఖ్ లకు ధీటుగా.. లగ్జరీ ఫ్లాట్ కొన్న స్టార్ హీరోయిన్!

ఇన్నాళ్లకు నా కల నెరవేరిందని, ఎట్టకేలకు ఓ స్థలానికి యజమానిగా మారానని తెగ సంబరపడిపోతోంది ఓ స్టార్ హీరోయిన్. బడా బడా హీరోలలో కొంత మందికి మాత్రమే ఆ ప్రాంతంలో ఫ్లాట్లు, లగ్జరీ ఇండ్లు ఉన్నాయి. ఇక ఈ బ్యూటీ అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ లాంటి ప్రముఖులు కొన్న దగ్గరే ఓ లగ్జరీ ఫ్లాట్ ను కొనుగోలు చేసింది. దీంతో ఈ విషయం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మరి తన కల నెరవేర్చుకున్న ఆ బ్యూటీ ఎవరు? తెలుసుకుందాం పదండి.

కృతి సనన్.. బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. సూపర్ స్టార్ మహేశ్ బాబు-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘1 నేనొక్కడినే’ మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ.. అక్కడే సెటిల్ అయ్యింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంది. తాజాగా ఈ బ్యూటీ హాట్ టాపిక్ గా మారింది. అతి కొద్ది మంది బాలీవుడ్ ప్రముఖులు ఫ్లాట్లు కొన్న అత్యంత విలువైన ప్రాంతంలో కృతి ఓ లగ్జరీ ఫ్లాట్ కొన్నది. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సుహానా ఖాన్, రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొణె లకు మాత్రమే అక్కడ విలువైన స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో కృతి సనన్ చేరింది.

దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబై స‌మీపంలోని అలీబాగ్‌లో బీచ్ ఒడ్డున అభినంద‌న్ లోధా వెంచ‌ర్‌లో 2000 sq ft ల‌గ్జ‌రీ స్ట‌లాన్ని కొనుగోలు చేసింది. దాని విలువ రూ. 2 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని స‌మాచారం. ఇక ఈ ఫ్లాట్ కొనుగోలు చేయడంతో తన కల నెరవేరిందని, ఓ స్థలానికి యజమానిని అయ్యానని సంతోషం వ్యక్తం చేసింది.  కాగా.. కృతి సనన్ లేటెస్ట్ మూవీల విషయానికి వస్తే.. ఆమె న‌టించిన తేరీ బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా, క్రూ చిత్రాలు ఇప్ప‌టికే విడుద‌లై వంద కోట్ల క్ల‌బ్ లో చేరి సంచ‌ల‌నం సృష్టించాయి. ప్ర‌స్త‌ుతం మ‌రో మూడు సినిమాలు కృతి చేతిలో ఉన్నాయి. మరి బిగ్ బి, షారుఖ్ ఖాన్ లు కొన్న ప్రాంతంలో ఈ బ్యూటీ లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetpir girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş