iDreamPost
android-app
ios-app

Suriya-karthi: ‘కంగువ’లో కార్తీ.. ఇదెక్కడి మాస్ ట్విస్ట్!

  • Published Jul 29, 2024 | 1:26 PM Updated Updated Jul 29, 2024 | 1:26 PM

కంగువ మూవీకి లిరిక్ రైటర్ గా పనిచేసిన వివేక ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు. ఈ మూవీలో కార్తీ ఉన్నాడా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ..

కంగువ మూవీకి లిరిక్ రైటర్ గా పనిచేసిన వివేక ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు. ఈ మూవీలో కార్తీ ఉన్నాడా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ..

  • Published Jul 29, 2024 | 1:26 PMUpdated Jul 29, 2024 | 1:26 PM
Suriya-karthi: ‘కంగువ’లో కార్తీ.. ఇదెక్కడి మాస్ ట్విస్ట్!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కంగువ’. డైరెక్టర్ శివ ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో సూర్య ఆరు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఈ మూవీకి లిరిక్ రైటర్ గా పనిచేసిన వివేక ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు. కంగువ మూవీలో కార్తీ ఉన్నాడా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ..

స్టార్ హీరో సినిమాల్లో ఇతర హీరోలు క్యామియో రోల్స్ చేయడం ఎప్పటి నుంచో ఉన్న ట్రెండ్. అయితే అన్న సినిమాల్లో తమ్ముడు అతిథి పాత్రల్లో చేయడం అన్నది చాలా రేర్ గా కనిపించే సందర్భం. ప్రస్తుతం అలాంటి సందర్భమే కంగువ చిత్రంలో ప్రేక్షకులు చూడబోతున్నారు. అవును కంగువ మూవీలో సూర్యతో కలిసి కొన్ని సీన్స్ లో నటించాడట కార్తీ. ఈ విషయాన్ని స్వయంగా ఆ మూవీ లిరిక్ రైటర్ చెప్పకనే చెప్పాడు. ఫైర్ సాంగ్ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లిరిక్ రైటర్ వివేక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు.

‘కంగువ మూవీలో కార్తీ యాక్ట్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత? అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. లిరిక్ రైట్ వివేక సమాధానం ఇస్తూ..”డైరెక్టర్ చెప్పకుండా ఈ విషయాన్ని ఎలా రివీల్ చేయాలో నాకు తెలీదు. కాకపోతే వాళ్లిద్దరి కాంబినేషన్ లో సీన్స్ ఉంటాయి”అంటూ కార్తీ ఇందులో చేస్తున్నాడు అంటూ చెప్పకనే చెప్పాడు. దాంతో సూర్య ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఇలాంటి వాటి గురించి చెబితే.. సినిమాపై ఇంట్రెస్ట్ తగ్గుతుందని, ఇలాంటి ట్విస్ట్ లను డైరెక్ట్ గా తెరపై చూస్తేనే కిక్కొస్తుందని పేర్కొంటున్నారు.

ఇక ఈ మూవీలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తోంది. బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ జానర్ లో ఇప్పటి వరకు తెరపై చూపించని కొత్త కాన్సెప్ట్ ఇందులో చూపించబోతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. త్రీడీలోనూ ఈ మూవీని తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా కంగువ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. మరి కంగువలో కార్తీ నటిస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetboo girişgrandpashabet