iDreamPost
android-app
ios-app

జైలులో దర్శన్ కి సకల సౌకర్యాలు కల్పించడంపై CM సీరియస్.. కీలక ఆదేశాలు..

Karnataka CM SiddaRamaiah Serious On Hero Darshan Issue: హీరో దర్శన్ జైలులో చిల్ అవుతున్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

Karnataka CM SiddaRamaiah Serious On Hero Darshan Issue: హీరో దర్శన్ జైలులో చిల్ అవుతున్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

జైలులో దర్శన్ కి సకల సౌకర్యాలు కల్పించడంపై CM సీరియస్.. కీలక ఆదేశాలు..

సొంత అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ దాదాపు రెండు నెలలుగా జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. పరప్పన జైలులో దర్శన్ రిమాండు ఖైదీగా ఉన్నాడు. జైలులో తమ అభిమాన హీరో ఎన్ని కష్టాలు పడుతున్నాడో అంటూ ఫ్యాన్స్ బయట కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే జైలులో దర్శన్ కష్టాలు పడటం కాదు.. వీవీఐపీ ట్రీట్మెంట్ తో ఫుల్ గా చిల్ అవుతున్నాడు. అందుకు సంబంధించిన ఒక ఫొటో కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తోటి ఖైదీలతో కలిసి దర్శన్ చక్కగా కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతూ.. సిగిరెట్ తాగుతూ ఉన్నాడు. ఆ ఫొటో వైరల్ కావడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈ విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

హీరో దర్శన్ కు జైలులో రాజభోగాలు అందుతున్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా.. హీరో దర్శన్ జైలులో ఉండి వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. ఈ విషయాలకు సంబంధించి జైలు అధికారులపై మాత్రమే కాకుండా.. అటు ప్రభుత్వంపై కూడా విమర్శలు వచ్చాయి. హీరో దర్శన్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని.. రాచ మర్యాదలు చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. ఈ విషయం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వద్దకు చేరింది. హీరో దర్శన్ విషయంలో ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీ- ఐజీపీ అలోక్ మోహన్ నుంచి ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన ప్రతి బాధ్యుడిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిని సస్పెండ్ కూడా చేశారు. అంతేకాకుండా.. దర్శన్- ఈ కేసులో ఉన్న మిగిలిన నిందితులను ఒకే దగ్గర కాకుండా.. వివిధ జైళ్లకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎంత పెద్ద అధికారుల ప్రమేయం ఉన్నా కూడా వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలి అని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దర్శన్ వ్యవహారానికి సంబంధించి సీఎం సిద్ధరామయ్య ట్వీట్ కూడా చేశారు. “పరప్పన జైలులో హీరో దర్శన్ కు రాచమర్యాదలు దక్కడాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోంది. దర్శన్ సహా మిగిలిన వారిని వివిధ జైళ్లకు మార్చాలని ఆదేశించాం. అలాగే దర్శన్ ఘటనలో బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించాం” అంటూ సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులు ఉన్నా కూడా సస్పెన్షన్ వేటు తప్పదని వెల్లడించారు.