nagidream
Karate Kalyani, Hema Rave Party: దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బెంగళూరు రేవ్ పార్టీ కేసు సంచలనంగా మారింది. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో టాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్నారన్న వార్తలు వచ్చాయి. ఈ కేసులో నటి హేమ కూడా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. తాజాగా ఈ అంశంపై నటి కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Karate Kalyani, Hema Rave Party: దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బెంగళూరు రేవ్ పార్టీ కేసు సంచలనంగా మారింది. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో టాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్నారన్న వార్తలు వచ్చాయి. ఈ కేసులో నటి హేమ కూడా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. తాజాగా ఈ అంశంపై నటి కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు.
nagidream
ప్రస్తుతం బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ రేవ్ పార్టీకి టాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారని వార్తలు వచ్చాయి. వీళ్ళలో టాలీవుడ్ నటి హేమ ఉన్నారని బెంగళూరు పోలీసులు తెలిపారు. అయితే హేమ మాత్రం తాను రేవ్ పార్టీకి వెళ్లలేదని.. ఫార్మ్ హౌజ్ లో ఉన్నానని ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత బిర్యానీ వండుతున్నట్టు మరొక వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలపై బెంగళూరు పోలీసులు స్పందిస్తూ.. హేమ పోలీసులను, మీడియాని తప్పు దోవ పట్టించేందుకే ఆమె వీడియో రిలీజ్ చేశారని అన్నారు. అయితే ఆ వీడియో ఎలా చేశారో అనే దానిపై విచారణ చేస్తున్నామని అన్నారు. అయితే హేమపై సినీ నటి కరాటే కళ్యాణి స్పందించారు.
హేమ తప్పు చేసింది కాబట్టి శిక్ష తప్పదని అన్నారు. మా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా.. మంచు విష్ణుతో మాట్లాడి హేమ మీద చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇండస్ట్రీలో హేమని సస్పెండ్ చేస్తామని అన్నారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడ్డ వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందే అని.. ఖచ్చితంగా హేమని సస్పెండ్ చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అన్నారు. ఇలాంటి వాళ్ళని క్షమించేది లేదని అన్నారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్టు పోలీసులకు శాంపిల్స్ దొరికితే హేమని అరెస్ట్ చేస్తారు కాబట్టి ఆమెను సస్పెండ్ చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అన్నారు. ఒకవేళ డ్రగ్స్ శాంపిల్స్ దొరక్కపోయినా కూడా ఇలాంటి రేవ్ పార్టీకి అటెండ్ అయినందుకు ఆమెను సస్పెండ్ చేస్తామని అన్నారు.
తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగానని అంటే ఎవరూ నమ్మరని.. కల్లు తాగావనే అంటారని.. అలానే రేవ్ పార్టీకి వెళ్లి డ్రగ్స్ తీసుకోలేదంటే నమ్మరని కళ్యాణి అన్నారు. మోహన్ బాబు, బాలకృష్ణ, మంచు విష్ణు, జయసుధ వంటి పెద్ద వాళ్ళు ఒక కమిటీ పెట్టి చర్చించుకుని చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ విషయంలో హేమ శిక్షార్హురాలే అని అన్నారు. ఇక ముందు అయినా చేసిన తప్పుని తెలుసుకుని కవర్ చేయడం కోసం మీడియాని, పోలీసులను తప్పుదోవ పట్టించుకోకుండా.. నేనే ఇండస్ట్రీకి పెద్ద ముత్తైదువునని అని ఓవర్ యాక్షన్ చేయకుండా.. పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది అని అన్నారు. అలాంటి పార్టీకి హేమ వెళ్లడమే తప్పు అని అన్నారు. ఈ కేసులో ఆమెకు శిక్ష పడడం ఖాయమని అన్నారు. ఒకవేళ అది జరగకపోయినా ఇండస్ట్రీలో సస్పెండ్ అవ్వడం ఖాయమని.. ఈ విషయంలో బల్లగుద్ది చెప్పగలనని అన్నారు.