iDreamPost
android-app
ios-app

షారుక్ ఖాన్ నా లైంగిక సమస్య అర్థం చేసుకున్నాడు: కరణ్ జోహార్

కరణ్ జోహార్ అంటే ఒక గొప్ప డైరెక్టర్, గొప్ప నిర్మాత అని అందరూ అంటారు. అయితే వ్యక్తిగతంగా మాత్రం కరణ్ జోహార్ చాలానే విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కునే విషయం తెలిసిందే. అయితే తాజాగా కరణ్ జోహార్ అలాంటి ఒక అంశంపై మరోసారి స్పందించారు.

కరణ్ జోహార్ అంటే ఒక గొప్ప డైరెక్టర్, గొప్ప నిర్మాత అని అందరూ అంటారు. అయితే వ్యక్తిగతంగా మాత్రం కరణ్ జోహార్ చాలానే విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కునే విషయం తెలిసిందే. అయితే తాజాగా కరణ్ జోహార్ అలాంటి ఒక అంశంపై మరోసారి స్పందించారు.

షారుక్ ఖాన్ నా లైంగిక సమస్య అర్థం చేసుకున్నాడు: కరణ్ జోహార్

కరణ్ జోహార్.. పాన్ ఇండియా లెవల్లో ఈ పేరు తెలియని సినిమా ప్రేక్షకులు ఉండరేమో. ఈయన డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్ రైటర్, కాస్ట్యూమ్ డిజైనర్ కూడా. కాఫీ విత్ కరణ్ షోతో హోస్టుగా కూడా మరింత పాపులర్ అయ్యారు. ఈయన ఏదొక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ముఖ్యంగా సినిమాలకు సంబంధించే కాకుండా.. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా ఎక్కువ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా తనలో ఉన్న లింగత్వం సమస్యకు సంబంధించి కరణ్ జోహార్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

కరణ్ జోహార్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. “నాలో స్త్రీ లింగత్వమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నా నడక, మాటల విషయంలో ఎక్కువగా జోక్స్ వేస్తూ ఉంటారు. మొదట్లో అయితే ఎక్కువగా ట్రోల్ చేసేవారు. నేను పెద్దవాడిని అయ్యే క్రమంలో ఆ వ్యాఖ్యలు కాస్త తగ్గుతూ వచ్చాయి. కానీ, నా వెనుక మాత్రం ఏదో కొత్త చర్చ జరుగుతూనే ఉంటుంది. నా ఈ సమస్యలో మాత్రం షారుక్ ఖాన్ నాకు చాలా హెల్ప్ చేశాడు. నేను నేనులా ఫీల్ అయ్యేలా షారుక్ ఖాన్ చేశాడు. నా లైంగిక సమస్య మాత్రమే కాదు.. ఏ పెద్ద సమస్య ఉన్నా కూడా నేను మొదట ఫోన్ చేసేది షారుక్ ఖాన్ కే” అంటూ కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు.

ఇంక డేటింగ్ యాప్ లో తనకు ఎదురైన వింత అనుభవం గురించి కూడా కరణ్ జోహార్ కామెంట్స్ చేశాడు. “నేను ఒకసారి డేటింగ్ యాప్ ని ట్రై చేశాను. రాయా అనే డేటింగ్ సెలబ్రిటీల కోసమే అని నేను విన్నాను. అందుకే ఆ డేటింగ్ యాప్ లో సైనప్ అయ్యాను. నాకు నచ్చిన వాళ్ల ప్రొఫైల్ ని టిక్ చేసే వాడిని. కొన్ని రోజులు గడిచినా కూడా వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చేది కాదు. అలా ఎవరి ప్రొఫైల్ ని టిక్ చేసినా కూడా ఎవరూ కూడా రియాక్ట్ అయ్యేవాళ్లు కాదు. కొన్నిరోజులకు నేను ఆ యాప్ ని వాడటం ఆపేశాను. తర్వాత నాకు అనిపించిన విషయం ఏంటంటే.. వాళ్లంతా నాది ఫేక్ అకౌంట్ అని భావించినట్లు ఉన్నారు. అందుకే నా ప్రొఫైల్ విషయంలో రియాక్ట్ అవ్వలేదు అని అర్థమైంది. నిజానికి వాళ్లు చేసింది చాలా మంచి పని అనే చెప్పాలి” అంటూ కరణ్ జోహార్ తనకు డేటింగ్ యాప్ లో ఎదురైన అనుభవం గురించి కూడా కామెంట్స్ చేశాడు.