iDreamPost
android-app
ios-app

అఫీషియల్: రామ్ చరణ్ మూవీలో కన్నడ సూపర్ స్టార్!

  • Published Jul 12, 2024 | 11:41 AM Updated Updated Jul 12, 2024 | 11:41 AM

Ram Charan-Shivaraj Kumar: ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Ram Charan-Shivaraj Kumar: ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Jul 12, 2024 | 11:41 AMUpdated Jul 12, 2024 | 11:41 AM
అఫీషియల్: రామ్ చరణ్ మూవీలో కన్నడ సూపర్ స్టార్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్నాడు. అగ్ర దర్శకుడు శంకర్ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. భారతీయుడు 2తో ఇన్నిరోజులు బిజీగా ఉండి.. చరణ్ మూవీని ఆలస్యం చేశాడు ఈ స్టార్ డైరెక్టర్. ఇప్పుడు ఆ మూవీ రిలీజ్ కావడంతో.. స్పీడ్ గా గేమ్ ఛేంజర్ ను ఫినిష్ చేసే పనిలో పడ్డాడు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. ఇక ఈ మూవీ తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో ఓ చిత్రం చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే..

రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. జాన్వీకపూర్ చరణ్ కు జోడీగా నటిస్తోంది. RC 16 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం పనులు జరుపుకొంటున్న ఈ మూవీ త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ కు వెళ్లనుంది. ఇక ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తాడని గతంలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజం అని చెప్తూ.. మేకర్స్ అఫీషియల్ గా ఈ విషయాన్ని ప్రకటించారు. శివన్న బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా టీమ్ లో భాగం అవుతున్నట్లు తెలిపారు.

కాగా.. రామ్ చరణ్ కోసం బుచ్చిబాబు అద్భుతమైన స్టోరీని రాసుకున్నాడని దానిని విని మేము షాక్ అయ్యామని శివరాజ్ కుమార్, విజయ్ సేతుపతి, ఏఆర్ రెహమాన్ లాంటివారు చెప్తున్నారు. ఇది గన్ షాట్ హిట్ అని వారు పేర్కొంటున్నారు. శివన్నకు కన్నడలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాంటి హీరో తెలుగులో మా నిర్మాణ సంస్థ ద్వారా ఎంట్రీ ఇస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ వారు తెలియజేశారు. మరి రామ్ చరణ్ మూవీలో శివన్న నటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss