iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ సీజన్ 8లోకి ప్రముఖ తెలుగు యాంకర్!

  • Published Jul 12, 2024 | 11:02 AM Updated Updated Jul 12, 2024 | 11:28 AM

Famouse Telugu Anchor Into Bigg Boss 8: బిగ్ బాస్ కి సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా ప్రేక్షకులు తెగ సంబరపడి పోతున్నారు. ఈ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని తెగ ఎదురుచూస్తున్నారు. అతి త్వరలోనే ఈ బిగ్ బాస్ షో స్టార్ట్ కాబోతోంది. ఈసారి ఒక తెలుగు ప్రముఖ యాంకర్ పేరు బాగా వినిపిస్తోంది.

Famouse Telugu Anchor Into Bigg Boss 8: బిగ్ బాస్ కి సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా ప్రేక్షకులు తెగ సంబరపడి పోతున్నారు. ఈ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని తెగ ఎదురుచూస్తున్నారు. అతి త్వరలోనే ఈ బిగ్ బాస్ షో స్టార్ట్ కాబోతోంది. ఈసారి ఒక తెలుగు ప్రముఖ యాంకర్ పేరు బాగా వినిపిస్తోంది.

  • Published Jul 12, 2024 | 11:02 AMUpdated Jul 12, 2024 | 11:28 AM
బిగ్ బాస్ సీజన్ 8లోకి ప్రముఖ తెలుగు యాంకర్!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈ యాంకర్ సుపరిచితురాలే. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. యాంకర్ గా పలు షోస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అలాగే సినిమాలు, వెబ్ సిరీస్ లు అంటూ చాలానే చేసింది. అయితే ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. షోస్, సినిమాలు అన్నింటికి గ్యాప్ ఇచ్చింది. ఆఖరి సారి బూతద్దం భాస్కర్ సినిమాలో ఒక నెగిటివ్ రోల్ లో కనిపించింది. ఇంక మొత్తం సినిమాలపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు.. యాంకర్ వర్షిణి. అయితే ఈ సమయంలో యాంకర్ వర్షిణికి సంబంధించి ఒక క్రేజీ వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే.. వర్షిణి బిగ్ బాస్ 8కి దాదాపుగా కన్ఫామ్ అయిపోయింది అంటున్నారు.

బిగ్ బాస్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ టాపిక్ అనే చెప్పాలి. ఇప్పటికే 7 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు 8వ సీజన్ ని స్టార్ట్ చేసేందుకు మేకర్స్ దాదాపుగా రెడీ అయిపోయారు. ఇప్పుటికే కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. అందులో భాగంగా ఇప్పటికే చాలానే పేర్లు వినిపిస్తున్నాయి. వాటిలో ప్రముఖంగా వేణుస్వామి, కుమారీ ఆంటీ, బర్రెలక్క పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంకో వైరల్ నేమ్ అయితే ఆ లిస్టుకు యాడ్ అయ్యింది. అదే యాంకర్ వర్షిణి. ఈ అమ్మడు హౌస్ లోకి అడుగు పెడితే రచ్చ రచ్చే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఎప్పుడూ ఎనర్జిటిక్ గా ఉండే ఈ అమ్మడు హౌస్ లోకి వెళ్తే ఆ సదండి వేరే ఉంటుంది.

అంతేకాకుండా.. వర్షిణి వచ్చీ రాని తెలుగుతో చేసే అల్లరికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే ఆమె డాన్సింగ్ స్కిల్స్ కి కూడా ఫిదా అయిపోతారు. అయితే ఎప్పుడూ సరదాగా ఉండే వర్షిణి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది అని కూాడ చూడాలి అనుకుంటున్నారు తెలుగు అభిమానులు. అంటే ఆమె ఎలా గొడవ పడుతుంది? ఎలా డిఫెండ్ చేసుకుంటుంది? అసలు గేమ్స్ ఎలా ఆడుతుంది? అనే ప్రశ్నలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఇవన్నీ పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు వెళ్తారు అనేది రెండ్రోజుల ముందు వరకు చెప్పే పరిస్థితి ఉండదు. రెండ్రోజుల ముందు కూడా షూట్ అయిన తర్వాత లీకుల రాయుళ్లు చెప్పే పేర్లను బట్టి కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంక బిగ్ బాస్ సీజన్ 8 విషయానికి వస్తే.. ఆగస్టు నెలలో కచ్చితంగా స్టార్ట్ చేస్తారు అని చెప్తున్నారు. అయితే మొదటి వారంలో లేదంటే.. నాలుగో వారంలో తాజా సీజన్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ నడుస్తోంది. మరి.. బిగ్ బాస్ హౌస్ లోకి యాంకర్ వర్షిణి వస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet