iDreamPost
android-app
ios-app

అభిమానులకు యంగ్ హీరోయిన్ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీ ఫోట్సో వైరల్!

Harshika Poonacha: ప్రేమ , పెళ్లి, ప్రెగ్నెస్సీ వంటి విషయాలక గురించి ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. తాజాగా మరో యంగ్ హీరోయిన్ ..తాను తల్లికాబోతున్నట్లు ప్రకటించింది. మరి.. ఆమె ఎవరంటే..

Harshika Poonacha: ప్రేమ , పెళ్లి, ప్రెగ్నెస్సీ వంటి విషయాలక గురించి ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. తాజాగా మరో యంగ్ హీరోయిన్ ..తాను తల్లికాబోతున్నట్లు ప్రకటించింది. మరి.. ఆమె ఎవరంటే..

అభిమానులకు యంగ్ హీరోయిన్ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీ ఫోట్సో వైరల్!

సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అలానే  పలువురు నటీనటులు కూడా తమ వ్యక్తిగత, సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. మరికొందరు అయితే తమ పెళ్లి, ప్రెగ్నెస్సీ వార్తలను కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తుంటారు. ఇటీవలే కొంతకాలం నుంచి కొందరు సెలబ్రిటీలు తమ పెళ్లికి సంబంధించిన న్యూస్ ను చెబుతున్నారు. తాజాగా ఓ యంగ్ హీరోయిన్ ఏకంగా తాను ప్రెగ్నెంట్ అంటూ పిక్స్ పోస్టు చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. ఆమె ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు తల్లిగా మారిన సంగతి తెలిసింది. లేడీ సూపర్ నయన తార, బాలీవుడ్ హీరోయిన్ ఆలియాభట్ వంటి పలువురు సెలబ్రిటీలు తమ ప్రెగ్నెస్సీ గురించి, అలానే తమకు పుట్టిన బిడ్డలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. మరికొందరు నటీమణులు అయితే బేబి బంప్ ను కూడా తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంటారు. ఇది ఇలా ఉంటే.. మరో యంగ్ హీరోయిన కూడ అమ్మ కాబోతుంది. అందుకు సంబంధించిని గుడ్ న్యూస్ ను సోషల్ మీడియా ద్వారా చెప్పేసింది.

కన్నడ ఇండస్ట్రీకి చెందిన హర్షిక తల్లి కాబోతుంది. ఈమె టాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటించింది. గతేడాదినే నటుడు భువన్ ను వివాహం చేసుకుంది. ఈ క్రమంలో తాజాగా తన ఫ్యాన్స్ కి శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నానని ఫిక్స్ తో సహా రివీల్ చేసింది. అయితే ఈ ఫొటోలో భర్తతో కలిసి వెరైటీగా ఔట్‌ఫిట్‌ డ్రెస్ లో కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే హర్షికాకు తోటి నటీనటులు విషేష్ చెబుతున్నారు. మీ జంట మధ్యలోకి మరో నూతన వ్యక్తి రాబోతున్నారు అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక హర్షిక విషయానికి వస్తే.. ఈమె కర్ణాటకు చెందిన హీరోయిన్. 15 ఏళ్ల నుంచి నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. కన్నడలో అనేక సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగు, తమిళ, మలయాళ, భోజ్‌పురి భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించింది.

‘ఏడు కొండలవాడ వెంకటరమణ అందరూ బాగుండాలి’, ‘అప్పుడు అలా ఇప్పుడు ఇలా’ అనే తెలుగు సినిమాల్లో నటించింది.  ఒకవైపు హీరోయిన్‌గా నటిస్తూనే గ్లామ్ గాడ్ ఫ్యాషన్ అనే కంపెనీ కూడా నడిపింది. ఈ వ్యాపారం హర్షిక భాగస్వామిగా నటుడు భువన్ పొన్నాన చేరాడు. ఇలా  వ్యాపార భాగస్వాములు కాస్తా 2023 ఆగస్టులో జీవిత భాగస్వామ్యలు మారారు. కర్ణాటకలోని కొడగు సంప్రదాయ పద్ధతిలో వీళ్ల వివాహం జరిగింది. అతి తక్కువ మంది బంధువులు, స్నేహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఇక పెళ్లైన ఏడాదికి  తాజాగా తమకు బిడ్డ పుట్టబోతున్నట్లు హర్షిక-భువన్ దంపతులు ప్రకటించారు. అక్టోబరులో డెలివరీ ఉంటుందని కూడా చెప్పేశారు. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Harshika Poonacha (@harshikapoonachaofficial)

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın alMadridbet güncel girişHoliganbet GirişMadridbetMadridbet giriş