iDreamPost
android-app
ios-app

విజయ్ మూవీతో టాలీవుడ్ లోకి మరో కన్నడ బ్యూటీ ఎంట్రీ!

  • Published Jul 29, 2024 | 1:07 PM Updated Updated Jul 29, 2024 | 1:12 PM

Rukmini Vasanth: టాలీవుడ్ లో కన్నడ బ్యూటీలో చాలా మంది ఉన్న సంగతి తెలిసింది. ఇక రష్మిక మందన్నా అయితే ఏకంగా నేషనల్ క్రష్ గా మారింది. ఇది ఇలా ఉంటే.. కన్నడ నుంచి మరో బ్యూటీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

Rukmini Vasanth: టాలీవుడ్ లో కన్నడ బ్యూటీలో చాలా మంది ఉన్న సంగతి తెలిసింది. ఇక రష్మిక మందన్నా అయితే ఏకంగా నేషనల్ క్రష్ గా మారింది. ఇది ఇలా ఉంటే.. కన్నడ నుంచి మరో బ్యూటీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

  • Published Jul 29, 2024 | 1:07 PMUpdated Jul 29, 2024 | 1:12 PM
విజయ్ మూవీతో టాలీవుడ్ లోకి మరో కన్నడ బ్యూటీ ఎంట్రీ!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడికి ఇతర చిత్ర పరిశ్రమలకు చెందిన వారు భారీగా వస్తుంటారు. ఇలా ఎంతోమంది ఇతర ఇండస్ట్రీల నుంచి వచ్చి.. టాలీవుడ్ లో సెటిల్ అయ్యారు. తమ సొంత ఇండస్ట్రీలో ఫెయిల్ అయినా  హీరోయిన్లు కూడా టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదిస్తున్నారు. ముఖ్యంగా కన్నడ, మలయాళం, తమిళ చిత్ర పరిశ్రమల నుంచి  చాలా మంది బ్యూటీలో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా తమదైన అందం, అభినయంతో ఆకట్టుకున్నారు. తాజాగా మరో కన్నడ బ్యూటీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అది కూడా రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాతో ఆ బ్యూటీ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు, ఆ వివరాలు  ఏమిటో ఇప్పుడు చూద్దాం..

కన్నడ నుంచి చాలా మంది హీరోయిన్లు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రష్మిక మందన్నా, అనుష్క శెట్టి, కృతిశెట్టి, ఆషికీ రంగనాథ్ వంటి అనేక మంది కన్నడ హీరోయిన్లు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక అనుష్క శెట్టి, రష్మిక మందన్నా టాలీవుడ్ లో ఎంత క్రేజ్ సంపాదించారో అందరికి తెలిసింది. ఇక రష్మిక మందన్నా అయితే పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా మారింది. ఇది ఇలా ఉంటే..కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో బ్యూటీ టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తుంది. ‘సప్త సాగారాలు దాటి’ అనే కన్నడ సినిమాతో రుక్మిణి వసంత్ తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఎలాంటి స్కిన్ షో చేయకుండానే, తన పెర్ఫార్మెన్స్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాందించింది. అంతేకాక ఆమె నటనకు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇది ఇలా ఉంటే.. ఈ బ్యూటీ నేరుగా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

అది కూడా రౌడీ హీరో విజయ్ దేవరకొండకు జోడీగా ఆ బ్యూటీ నటించనుంది. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ రూరల్ యాక్షన్‌‌ డ్రామాలో హీరోయిన్‌‌గా రుక్మిణి వసంత్‌‌ను తీసుకోబోతున్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ రెండు కన్నడ చిత్రాల్లో నటిస్తుంది. అలానే రెండు తమిళ చిత్రాల్లోనూ ఫిమేల్‌‌ లీడ్‌‌గా చేస్తోంది.  విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ సినిమాను ‘రాజావారు రాణీగారు’ ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను శ్రీ వెంక‌‌టేశ్వర క్రియేష‌‌న్స్ బ్యాన‌‌ర్‌‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. మొత్తంగా విజయ్ సినిమాతో మరో కన్నడ బ్యూటీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. మరి..ఈమె ఏ మేరకు టాలీవుడ్ లో సక్సెస్ అవుతుందో చూడాలంటే..కొంతకాలం ఆగాల్సిందే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet