iDreamPost
android-app
ios-app

నార్త్ లో వరుస నష్టాలు.. ఇక్కడి రెమ్యూనరేషన్ తో పూడ్చుతుందా?

  • Author ajaykrishna Updated - 11:25 AM, Fri - 15 September 23
  • Author ajaykrishna Updated - 11:25 AM, Fri - 15 September 23
నార్త్ లో వరుస నష్టాలు.. ఇక్కడి రెమ్యూనరేషన్ తో పూడ్చుతుందా?

కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. కొన్నాళ్ళుగా ఈమె సినిమాలు ఎలా వివాదాలకు దారి తీస్తున్నాయో.. ఆమె చేసే కామెంట్స్ కూడా అంతే వివాదాలు సృష్టిస్తున్నాయి. అయినా ఏమాత్రం తగ్గకుండా మొహం మీదే విషయాన్ని ఖండించే తీరు మార్చుకోలేదు. కంగనా కామెంట్స్ వల్ల బాలీవుడ్ లో ఆమె సినిమాలకు కూడా అడ్డంకులు ఏర్పడుతుంటాయి. ఒక్కోసారి సూపర్ ఫామ్ లో ఉన్న స్టార్స్, ప్రొడ్యూసర్స్ ని విమర్శించి వార్తల్లో నిలుస్తుంటుంది. సినిమా, రాజకీయం ఇలా ఎలాంటి విషయంలోనైనా కంగనా తన గొంతు వినిపిస్తుంటుంది.

ఇండస్ట్రీలో చాలా డేరింగ్ హీరోయిన్స్ లో కంగనా పేరు ముందుగా వినిపిస్తుంది. అలాగని కాంట్రవర్సీ వస్తే ఆమెను విమర్శించే వారితో పాటు.. ఆమె ముక్కుసూటి తనానికి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కెరీర్ ఆరంభంలో గ్లామర్ రోల్స్ చేసినప్పటికి.. నేషనల్ అవార్డులు అందుకున్నప్పటి నుండి గ్లామర్ షో తగ్గించి.. నటన, క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఉన్న కథలు ఎంచుకుంటోంది. మంచి కథలతో సినిమాలైతే చేస్తోంది గానీ.. కొన్నాళ్ళుగా ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలం అవుతూ వచ్చాయి. దీంతో బాలీవుడ్ ట్రోలింగ్ ని పక్కన పెట్టి.. మధ్యమధ్యలో సౌత్ సినిమాలు చేస్తుంటుంది. అలా గతేడాది తలైవి చేసింది. ఇప్పుడు చంద్రముఖి 2 చేసింది.

కంగనా నటించిన చంద్రముఖి 2 ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ గట్టిగానే జరుగుతున్నాయి. అయితే.. ఈ సినిమా కోసం కంగనా ఊహించని రెమ్యూనరేషన్ అందుకుందని కోలీవుడ్ వర్గాల టాక్. చంద్రముఖి 2 కోసం కంగనాకు ఏకంగా రూ. 22 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారని సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా ఏ స్టార్ హీరోయిన్ కి అంత ఇవ్వట్లేదట. అలాంటి సౌత్ లో కంగనా ఇంత తీసుకుందంటే.. ఖచ్చితంగా మీడియం రేంజ్ హీరోలను మించే అని చెప్పాలి. కాగా.. కంగనా రెమ్యూనరేషన్ విషయం తెలిసి.. నార్త్ లో వచ్చిన వరుస నష్టాలను ఇలా సౌత్ రెమ్యూనరేషన్స్ తో కవర్ చేస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి కంగనా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss