Keerthi
Bharateeyudu 2: శంకర్- కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న తాజా ఇండియన్-2. కాగా, ఈ సినిమా కోసం కమల్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కాగా, ఎట్టాకేలకు ఈ సినిమా రేపు థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఇకపోతే సినిమాకు సంబంధించి టికెట్స్ ధర తెలంగాణ కన్నా ఆ ప్రాంతంలో తక్కువగా ఉందని నెట్టింట పెద్ద చర్చ జరుగుతంది.
Bharateeyudu 2: శంకర్- కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న తాజా ఇండియన్-2. కాగా, ఈ సినిమా కోసం కమల్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కాగా, ఎట్టాకేలకు ఈ సినిమా రేపు థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఇకపోతే సినిమాకు సంబంధించి టికెట్స్ ధర తెలంగాణ కన్నా ఆ ప్రాంతంలో తక్కువగా ఉందని నెట్టింట పెద్ద చర్చ జరుగుతంది.
Keerthi
విశ్వనటుడు కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో గతంలో ‘భారతీయుడు’ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా 1996 నాటి సమాజంలో ఉన్న పరస్థితులకు తగ్గట్లుగా దర్శకుడు శంకర్ సినిమాని తెరకెక్కించారు. ఇక ఆ సినిమా అప్పటిలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కాగా, ఇన్నేళ్లకు మళ్లీ భారతీయుడుకి సీక్వెల్ గా ‘ఇండియన్-2’ సినిమాను శంకర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆడియాన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమా మీద అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇకపోతే ఈ సినిమా రేపు అనగా.. జూలై 12వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో సందడి చేయనుంది.ఈ మేరకు ఇండియన్2 సినిమాకు అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. అలాగే ఇప్పటికే తెలంగాణలో వారం రోజుల పాటు టికెట్స్ ధర పెంచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అలాగే టికెట్స్ ధరలపై ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కానీ, తాజాగా ఈ ఇండియన్- 2 సినిమాకు తెలంగాణలో కన్నా ఆ రాష్ట్రంలో టికెట్ ధరలు తక్కువగా ఉన్నాయట. ఇక ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. టికెట్ ధర అక్కడికి , ఇక్కడికి ఇంత వెరియషన్ ఏమిటి అంటూ సోషల్ మీడియాలో చర్చంశనీయంగా మారింది.ఆ వివరాళ్లోకి వెళ్తే..
శంకర్- కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న తాజా ఇండియన్-2. కాగా, ఈ సినిమా కోసం కమల్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కాగా, ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు తెలంగాణలో కూడా వారం రోజుల పాటు టికెట్స్ పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతివ్వడంతో పాటు.. రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌ల్లో రూ.75, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50 టికెట్‌పై పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ మల్టీప్లెక్స్ లోని ఇండియన్ 2 సినిమా ఒక్కో టికెట్ ధర రూ.350 ఉంది. కానీ, చెన్నైలో మాత్రం టికెట్ ధరలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే.. చెన్నైలోని మల్టీప్లెక్స్‌ల్లో ఒక్కో టికెట్ ధర కేవలం రూ.190 రూపాయలుగా ఉంది. దీంతో ఈ విషయం కాస్త నెట్టింట వైరల్ గా మారడంతో.. కోలీవుడ్ సినిమాకు తెలుగులో టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటమేంటని సోషల్ మీడియా వేదికగా నెటజన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ ఇండియన్ సినిమా పై తెలుగు రాష్ట్రాల్లో భారీ హంగామా నెలకొంది. కానీ, తమిళనాడులో మాత్రం ఆ హడావుడి అంతగా కనిపించడం లేదని టాక్ వినిపిస్తుంది. ఇక అందుకు కారణం.. బుక్ మై షోలో భారతీయుడు-2 సినిమాకి షోస్ చెన్నైలో టికెట్స్ రిలీజ్ చేశారు. ఇక టికెట్స్ అయితే ఫిల్ అవుతున్నాయి. కానీ, అనుకున్నంత వేగంగా మాత్రం టికెట్స్ ఫిల్ అవుతున్నట్లు అనిపించడం లేదు. నిజానికి తమిళనాట ఆడియన్స్ లో ఎగ్జైట్మెంట్ ఇంకా ఎక్కువ ఉండాల్సింది. కానీ, ఈసారి ఆ ఆసక్తి, ఆతురత తెలుగు ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. మరి, తమిళనాడు కన్నా తెలంగాణలో ఇండియన్-2 సినిమా మల్లీప్లెక్స్ టికెట్స్ ఎక్కువగా ఉండటంపై మీ అభిప్రాయానలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.