iDreamPost
android-app
ios-app

Bharateeyudu2 Day 1 Collections: భారతీయుడు 2 డే వన్ కలెక్షన్లు! షాకింగ్ వసూళ్లు..

  • Published Jul 13, 2024 | 10:29 AM Updated Updated Jul 13, 2024 | 10:29 AM

విశ్వనటుడు కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భారతీయుడు 2. జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం.. తొలిరోజు ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసుకుందాం.

విశ్వనటుడు కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భారతీయుడు 2. జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం.. తొలిరోజు ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసుకుందాం.

  • Published Jul 13, 2024 | 10:29 AMUpdated Jul 13, 2024 | 10:29 AM
Bharateeyudu2 Day 1 Collections: భారతీయుడు 2 డే వన్ కలెక్షన్లు! షాకింగ్ వసూళ్లు..

ఎన్నో అవంతరాలను ఎదుర్కొని.. ఎట్టకేలకు కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారతీయుడు 2 జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. దాదాపు రెండున్నర దశాబ్దల తర్వాత వచ్చిన ఈ రీమేక్ మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ తొలిరోజే ఊహించని వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. బజ్ తక్కువ ఉన్నప్పటికీ.. ఫస్ట్ డే భారీ ఓపెన్సింగ్స్ నే రాబట్టింది. మరి కమల్-శంకర్ మూవీ తొలిరోజు ఎన్నికోట్లు రాబట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం.

విశ్వనటుడు కమల్ హాసన్, అగ్రదర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం భారతీయుడు 2. వీరి కాంబోలోనే 1996లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ భారతీయుడుకు ఇది సీక్వెల్. దాంతో ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ట్రైలర్ కు కూడా మాసీవ్ రెస్పాన్స్ రావడంతో.. సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. ఇన్ని అంచనాల మధ్య జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. అయితే తొలి ఆట నుంచే మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ.. వసూళ్లలో ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. తమిళ్ కు ధీటుగా తెలుగులో కలెక్షన్లు రాబట్టాడు లోకనాయకుడు.

ఇక కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో 9 నుంచి 10 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే.. వసూళ్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక తమిళనాడు విషయానికి వస్తే.. బుకింగ్స్ వీక్ గానే ఉన్నప్పటికీ.. ఆఫ్ లైన్ టికెట్లు ఎక్కువ తెగడంతో.. 12 నుంచి 14 కోట్ల వరకు ఓపెనింగ్స్ వచ్చినట్లు సమాచారం. హిందీ, కేరళ, కర్ణాటకలతో పాటుగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 8 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను అందుకున్నట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ లో భారతీయుడు 2 ఊహించని కలెక్షన్లు కొల్లగొట్టాడు. ప్రీమియర్స్ తో పాటుగా డే వన్ కలెక్షన్లతో కలుపుకొని దాదాపు 3 మిలియన్ల డాలర్లు రాబట్టినట్లు సమాచారం. ఇక ఓవరాల్ గా చూసుకుంటే.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 55 కోట్ల నుంచి 58 కోట్ల వరకు ఫస్ట్ డే కలెక్షన్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. మరి మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ.. ఈ రేంజ్ లో కమల్ కలెక్షన్లు రాబట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş