iDreamPost
android-app
ios-app

రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య ఆత్మహత్యాయత్నం.. చివరి నిమిషంలో..

  • Published Jul 13, 2024 | 9:11 AM Updated Updated Jul 13, 2024 | 9:14 AM

Raj Tharun and Lavanya Case: తెలుగు ఇండస్ట్రీలో పది రోజులుగా యంగ్ హీరో రాజ్ తరుణ్ ఆయన మాజీ ప్రియురాలు లావణ్య కి సంబంధించి కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ముగ్గురిపై కేసు నడుస్తుంది.

Raj Tharun and Lavanya Case: తెలుగు ఇండస్ట్రీలో పది రోజులుగా యంగ్ హీరో రాజ్ తరుణ్ ఆయన మాజీ ప్రియురాలు లావణ్య కి సంబంధించి కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ముగ్గురిపై కేసు నడుస్తుంది.

  • Published Jul 13, 2024 | 9:11 AMUpdated Jul 13, 2024 | 9:14 AM
రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య ఆత్మహత్యాయత్నం.. చివరి నిమిషంలో..

తెలుగు రాష్ట్రాల్లో హీరో రాజ్ తరుణ్ అతని మాజీ ప్రియురాలు లావణ్యకు సంబంధించిన విషయం హాట్ టాపిక్ గా మారింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదుల చేసుకుంటున్నారు. రాజ్ తరుణ్ తో గత 11 ఏళ్లుగా కలిసి కాపురం చేసినట్లుగా లావణ్య ఆరోపిస్తుంది. 2014 తమకు పెళ్లయ్యిందని.. రెండు సార్లు అబార్షన్ రాజ్ తరుణ్ దగ్గరుండి మరీ చేయించాడని ఈ మేరకు ఆధారాలు పోలీసులకు సమర్పించింది. ఈ మధ్య మాల్వీ మల్హోత్రా అనే హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకొని తనను దూరం చేశాడని.. అంతేకాదు మాల్వీ మల్హోత్ర సోదరుడు మయాంక్ అందరూ కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించి మానసికంగా కృంగదీశారని ఫిర్యాదులో పేర్కొంది. తాజాగా రాజ్ తరుణ్, లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

రాజ్ తరుణ్, లావణ్య కేసులో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. రాజ్ తరుణ్ తాను ఎంతో హ్యాపీగా ఉండేవాళ్లమని.. ఈ మధ్య నటి మాల్వీ మల్హోత్రా తమ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చి మనశ్శాంతి లేకుండా చేస్తుందని లావణ్య ఆరోపిస్తుంది. పదకొండు ఏళ్లుగా కలిసి ఉన్న తమను విడగొట్టిందని, ఈ క్రమంలోనే రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రపై పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. లావణ్య తాను చనిపోతున్నట్లుగా 112 కు ఫోన్ చేసింది. వెంటనే అలర్ట్ అయిన నార్సింగ్ పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి ఆత్మహత్యా ప్రయత్నాన్ని ఆపి ఆమెను రక్షించారు.

లావణ్యకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎంత చెప్పినప్పటికీ.. తనకు రాజ్ తరుణ్ కావాలి తను లేకుంటే నేను బతకలేను అంటూ లావణ్య కన్నీరు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే రాజ్ తరుణ్ నా చావును కోరుకుంటున్నాడు, నేను ఏంటో తెలిసిన మనషులు నన్ను తప్పుబడతున్నారు. మైండ్ గేమ్స్, గాసిప్స్ తో నేను మానసికంగా విసుగెత్తిపోయాను. మస్తాన్ కేసులో నేను కీలు బొమ్మను అయ్యాను.. ఇవన్నీ పథకం ప్రకారం జరుగుతున్నాయి. నా భర్త రాజ్ తరుణ్ ని వదలమని మాల్వీని ఎంతో బ్రతిలాడాను. నాను ఆకలితో అలమటిస్తుంటే.. వారిద్దరూ ఎంజాయ్ చేస్తున్నారు. నా చావుకు రాజ్ తరుణ్ ఆయన కుటుంబం, మాల్వీ మల్హోత్ర కుటుంబం అంటూ లావణ్య ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ కేసులో న్యాయం జరిగేలా చేస్తామని పోలీసులు లావణ్య కు భరోసా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom