iDreamPost
android-app
ios-app

కల్కి లీక్స్ పై మేకర్స్ సీరియస్! VFX కంపెనీపై కేసు?

  • Author ajaykrishna Published - 04:25 PM, Sun - 17 September 23
  • Author ajaykrishna Published - 04:25 PM, Sun - 17 September 23
కల్కి లీక్స్ పై మేకర్స్ సీరియస్! VFX కంపెనీపై కేసు?

ఈ మధ్యకాలంలో సినిమాలకు సంబంధించి లీక్స్ అనేవి షూటింగ్స్ ని, ఫ్యాన్స్ ని చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఏ సినిమాకైనా సీరియస్ వర్క్ జరుగుతున్నప్పుడు.. మధ్యలో అది లీక్ అయ్యింది.. ఇది లీక్ అయ్యిందని తెలిస్తే అందరికంటే ఎక్కువ టెన్షన్ పడేది మేకర్స్. ఇప్పుడు ఏదైనా ఒక విజువల్ లీక్ అయ్యిందంటే.. ఆ లీక్ గురించి ఆది నుండి అంతం వరకు తేల్చేసరికి షూటింగ్ ఫ్లో దెబ్బతింటుంది. సరే.. చిన్న సినిమాలకు ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయంటే ఓ రకంగా అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. అదే పదిహేను భాషలకు పైగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న సినిమాలకు సంబంధించి ఎలాంటి లీక్ జరిగినా సమస్య చాలా పెద్దది అవుతుంది.

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ కల్కి విషయంలో అదే జరుగుతున్నట్లు తెలుస్తుంది. దర్శకుడు నాగ్ అశ్విన్, వైజయంతి బ్యానర్ కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘కల్కి 2898 AD’ తెరకెక్కుతోంది. దీనికి సంబంధించి టైటిల్ రివీల్ చేయడానికి దాదాపు ఏడాదికి పైగా సమయం తీసుకున్నారు మేకర్స్. అలాంటిది ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటున్న కల్కి నుండి.. ప్రభాస్ లుక్ లీక్ అయ్యిందని వార్తలు గుప్పుమన్నాయి. ఇంకేముంది.. ఆ ఫోటో కాస్త సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో వైరల్ అవ్వడంతో విషయం మేకర్స్ దృష్టిలో పడిందట.

దీంతో ఇప్పుడు మేకర్స్.. కల్కి విజువల్స్ ఎఫెక్ట్స్ వర్క్ చేస్తున్న కంపెనీపై సీరియస్ అయినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకు హాలీవుడ్ విఎఫ్ఎక్స్ కంపెనీ వర్క్. చేస్తుంది. అయితే.. లీక్ అయిన పిక్ విఎఫ్ఎక్స్ కంపెనీ నుండి జరిగిందని.. విఎఫ్ఎక్స్ వారే ఎవరో లీక్ చేశారని కథనాలు బయటికి వచ్చేశాయి. వెంటనే అలర్ట్ అయిన కల్కి టీమ్.. సోషల్ మీడియాలో నుండి లీకైన పిక్ డిలీట్ చేయించినట్లు సమాచారం. పిక్ లీక్ చేసినందుకు విఎఫ్ఎక్స్ కంపెనీపై మూవీ యూనిట్ కేసు వరకు వెళ్లిందని సినీ వర్గాలలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటిదాకా దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే మేకర్స్ నుండి ఏమైనా రియాక్షన్ వస్తుందేమో చూడాలి. కల్కి మూవీ లీక్స్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş