iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ జోన్ లో అడ్వాన్స్ బుకింగ్ లో ‘కల్కి’ సూపర్ రికార్డ్!

Kalki 2898AD: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కల్కి 2898 ఏడి. జూన్ 27వ తేదీన ప్రపంచవ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

Kalki 2898AD: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కల్కి 2898 ఏడి. జూన్ 27వ తేదీన ప్రపంచవ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

హైదరాబాద్ జోన్ లో అడ్వాన్స్ బుకింగ్ లో ‘కల్కి’ సూపర్ రికార్డ్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ..సలార్ మూవీ తరువాత తాజాగా నటించిన చిత్రం 2898ఏడి. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు.  జూన్ 27వ తేదీన ప్రపంచవ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. అలానే కల్కి టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. ఇదే సమయంలో ఈ సినిమా పలు రికార్డులను బద్దల కొడుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. ఈక్రమంలోనే హైదరాబాద్ జోనల్ పరిధిలోని థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్ విషయంలో కల్కి రికార్డు క్రియేట్ చేసింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కల్కి 2898 ఏడి. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ , దీపికా పదుకోన్, దిశా పటానీ, శోభన, అన్నాబెన్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన అందరిలో భారీగా అంచనాలు ఉన్నాయి. ఇటీవలే విడుదలైన టీజర్, ట్రైలర్స్ తో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా మరో మూడు రోజుల్లో విడుదల కానుంది. గత కొన్ని నెలల నుంచి టాలీవుడ్ లో పెద్ద సినిమాలు ఏమి రిలీజ్ కాలేదు. ఇంకా చెప్పాలంటే సంక్రాంతి తరువాత నుంచి పెద్ద చిత్రాలు ఏమి ప్రేక్షకులను పలకరించలేదు.

Kalki Tickets price

సంక్రాంతి తర్వాత అలాంటి జోష్‌ మళ్లీ కల్కి2898ఏడీతో మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా టికెట్ల బుకింగ్స్ కూడా కూడా ప్రారంభం అయ్యాయి.  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కల్కి 2898ఏడీ పాన్‌ ఇండియా మూవీగా విడుదల కానుంది. నాగ్‌ అశ్విన్‌ దర్శవకత్వంలో ఈ చిత్రాన్ని వైజయంతీ సంస్థ నిర్మించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను భారీగా ప్రదర్శించనున్నారు. అలానే గ్రేటర్ హైదరాబాద్ సింగిల్‌ థియేటర్‌ నుంచి మల్టీఫ్లెక్స్‌ల వరకు ప్రతిచోట ప్రభాస్ సినిమానే చిత్రాన్నే ప్రదర్శిస్తున్నారు. బాహుబలి, ట్రిపుల్ వంటి రాజమౌళి సినిమాల తరువాత ఆ స్థాయి హైప్ కల్కికి కనిపిస్తోంది. దీంతో టికెట్లు హాట్ కేకుల్లా బుక్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే హైదరబాద్‌ జోన్‌ పరిధిలో తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్‌ విషయంలో కల్కి2898 ఏడీ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. మొదటి రోజు రూ. 6 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. ఈ మొత్తం విడుదల సినిమా విడుదల సమాయానికి ఇంకా పెరగవచ్చని కూడా అభిప్రాయ పడుతున్నారు. ఇక కల్కి టికెట్ల ధరలను వారం రోజుల పాటు పెంచుకునే అవకాశాన్ని తెలంగాణ సర్కార్ కల్పించింది. మొత్తంగా సినిమా రిలీజయ్యే నాటికి ఇంకా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తోంది తెలియాలంటే మరో రెండు రోజు ఎదురు చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి