iDreamPost
android-app
ios-app

Kalki 2898 AD: కల్కి ఖాతాలో మరో అరుదైన ఘనత.. ఇది ఆల్ టైమ్ రికార్డ్!

  • Published Jul 13, 2024 | 1:31 PM Updated Updated Jul 13, 2024 | 1:44 PM

ఇప్పటికే కల్కి మూవీ రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ ఘనత చాలా స్పెషల్. ఆ వివరాల్లోకి వెళితే..

ఇప్పటికే కల్కి మూవీ రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ ఘనత చాలా స్పెషల్. ఆ వివరాల్లోకి వెళితే..

Kalki 2898 AD: కల్కి ఖాతాలో మరో అరుదైన ఘనత.. ఇది ఆల్ టైమ్ రికార్డ్!

‘కల్కి 2898 ఏడీ’ విడుదల అయ్యి రెండు వారాలు కావొస్తున్నప్పటికీ.. కలెక్షన్ల జోరు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. భారతీయుడు 2 రిలీజ్ అవ్వడంతో.. ప్రభాస్ మూవీపై ఈ ప్రభావం పడుతుందని అందరూ భావించారు. కానీ కమల్ చిత్రానికి మిక్స్ డ్ టాక్ రావడం, ప్రేక్షకులను మెప్పించకపోవడంతో.. కల్కి వసూళ్లకు తిరుగులేకుండా పోయింది. ఇప్పటికే రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా తన ఖాతాలో మరో ఘనతను వేసుకుంది. ఇది మామూలు రికార్డు కాదు.. తెలుగు సినిమా చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్. ఆ వివరాల్లోకి వెళితే..

డార్లింగ్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి’. డైరెక్టర్ నాగ్ అశ్విన్ అత్యద్బుతంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ.. దూసుకెళ్తోంది. విడుదలై రెండు వారాలు కావొస్తున్నప్పటికీ వసూళ్లు మాత్రం తగ్గనివ్వడం లేదు. కలెక్షన్లను హోల్డ్ చేస్తూ.. రూ. 1000 కోట్ల క్లబ్ కు చేరుకుంది. ఈ క్రమంలోనే పలు రికార్డులు బ్రేక్ చేసింది కల్కి మూవీ. తాజాగా మరో ఘనతను తన పేరిట లిఖించుకుంది. అదేంటంటే?

కల్కి 2898 ఏడీ మూవీ తెలుగు వెర్షన్ లో నార్త్ అమెరికాలో ఏకంగా 12 మిలియన్లను వసూళ్ చేసింది. దాంతో తెలుగు వెర్షన్ లో ఈ ఘనత సాధించిన మూవీగా కల్కి ఆల్ టైమ్ రికార్డు ను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇంతటితో ఆగకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పట్లో పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడం, వచ్చిన భారతీయుడు 2 కూడా ఆకట్టుకోకపోవడంతో.. కల్కి వసూళ్లకు అడ్డులేదు. ఇక ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీల్లో ప్రభాస్ నటించినవే ఎక్కువ ఉండటం విశేషం. బాహుబలి, బాహుబలి 2, సలార్, సాహోలతో పాటుగా ఆర్ఆర్ఆర్ మూవీకూడా ఈ లిస్ట్ లో ఉంది. మరి నార్త్ అమెరికాలో 12 మిలియన్లతో ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పిన కల్కి మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Skyupsmedia (@skyupsmedia)