iDreamPost
android-app
ios-app

ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చిన కల్కి టీమ్.. ఇది నెక్ట్స్ లెవల్ అంతే!

  • Published May 27, 2024 | 8:22 PM Updated Updated May 27, 2024 | 8:22 PM

Kalki 2898 AD Movie- Big Surprise For Prabhas Fans: డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు కల్కి సినిమా టీమ్ బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చేసింది. ఇంక అప్ డేట్స్ ఆగడం అనే ప్రసక్తే కనిపించడం లేదు. ఇంక సినిమా రిలీజ్ అయ్యేవరకు ఏదో అప్ డేట్ వచ్చేలాగే కనిపిస్తోంది.

Kalki 2898 AD Movie- Big Surprise For Prabhas Fans: డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు కల్కి సినిమా టీమ్ బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చేసింది. ఇంక అప్ డేట్స్ ఆగడం అనే ప్రసక్తే కనిపించడం లేదు. ఇంక సినిమా రిలీజ్ అయ్యేవరకు ఏదో అప్ డేట్ వచ్చేలాగే కనిపిస్తోంది.

  • Published May 27, 2024 | 8:22 PMUpdated May 27, 2024 | 8:22 PM
ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చిన కల్కి టీమ్.. ఇది నెక్ట్స్ లెవల్ అంతే!

డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఎందుకంటే ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కీ 2898 ఏడీ మూవీకి సంబంధించి వరుస అప్ డేట్స్, సర్ ప్రైజులతో అల్లాడించేస్తున్నారు. ఇటీవల అందరికీ భైరవ తన బుజ్జీని పరిచయం చేశాడు. అంతేకాకుండా.. ఒక పెద్ద ఈవెంట్ పెట్టి బుజ్జిని నేరుగా ప్రభాస్ డ్రైవ్ చేసి మరీ చూపించాడు. అలాగే బుజ్జితో సెల్ఫీ దిగే ఛాన్స్ కూడా ఫ్యాన్స్ కి కల్పిస్తున్నారు. ఇలాంటి అప్ డేట్స్ మధ్య.. మరో బిగ్ సర్ ప్రైజ్ తో కల్కీ టీమ్ వచ్చేసింది. ఇది అలాంటి ఇలాంటి అప్ డేట్ కాదు. నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటి వార్త. మరి.. ఆ సర్ ప్రైజ్ ఏంటి? అసలు ఆ అప్ డేట్ ఏంటో చూద్దాం.

ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో ప్రభాస్ కల్కీ 2898 ఏడీ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. వాటిని మరింత రెట్టింపు చేస్తూ టీమ్ అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా కల్కీ సినిమా గురించే బజ్ నడుస్తోంది. అంతా బుజ్జి గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ బజ్ ఇంకోస్థాయికి తీసుకెళ్తూ.. ఇప్పుడు కొత్త సర్ ప్రైజ్ తీసుకొచ్చారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను ఎక్స్.కామ్ లో అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది. అది కూడా సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ, క్రూషియల్ అప్ డేట్ ఇచ్చారు. అదేంటంటే.. కల్కి సినిమాకి సంబంధించిన యానిమేటెడ్ టీజర్ కి సంబంధించింది.

ఎప్పటి నుంచో కల్కి సినిమాకి సంబంధించి ఒక యానిమేటెడ్ టీజర్ వస్తుందని చెప్తూనే ఉన్నారు. అది కాస్తా ఇవాళా, రేపు అంటూ వాయిదాలు పడుతూ వచ్చింది. దానిపై అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా.. వస్తుందని అంతా ఎదురుచూశారు. ఇప్పుడు ఉరుములు లేని వానలా.. ఒక్కసారిగా ఈ యానిమేటెడ్ టీజర్ కి సంబంధించిన అఫీషియల్ అప్ డేట్ తీసుకొచ్చారు. 8 గంటలకు రెడీగా ఉండండి.. అంటూ వైజయంతీ మూవీస్ తమ ఖాతాలో పోస్ట్ చేసింది. 8 గంటలకు అమెజాన్ ప్రైమ్ లో అప్ డేట్ వస్తుందని చెప్పారు. చెప్పిన సమయానికి ఆ సర్ ప్రైజ్ ఇచ్చేశారు. అందుకు సంబంధించి ఒక వీడియో విడుదల చేశారు.

ఆ వీడియోలో ప్రభాస్ బుజ్జికి వెల్డింగ్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత కొందరు పిల్లలు వచ్చి ఇంకా ఎప్పుడు చూపిస్తావ్? అంటూ ప్రశ్నిస్తారు. ఆ తర్వాత ప్రభాస్ బుజ్జిని చూపించమని అడగ్గానే.. బుజ్జి- ప్రభాస్ ఇద్దరి యానిమేటెడ్ వీడియో వస్తుంది. మే 31న అధికారికంగా ఈ యానిమేటెడ్ టీజర్ ని విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. అంటే కల్కి సినిమా ఎలా ఉండబోతోంది? మీరు కల్కి నుంచి ఏం ఎక్స్ పెక్ట్ చేయచ్చు అనే అంశాలను, కాస్త కథను కూడా చెబుతూ ఆ టీజర్ ఉంటుందని చెబుతున్నారు. మరి.. ఫ్యాన్స్ కు కల్కి 2898 ఏడీ మూవీ టీమ్ ఇచ్చిన సర్ ప్రైజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbayspin girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom