Dharani
కల్కి సినిమా నటీనటుల రెమ్యూనరేషన్ గురించి ఇప్పటికే అనేక వార్తలు రాగా.. తాజాగా కమల్ హాసన్ తీసుకున్న పారితోషికం ప్రతి ఒక్కరిని షాక్‌కు గురి చేస్తోంది. 7 నిమిషాల కోసం కమల్ కోట్ల రూపాయలు తీసుకున్నాడని టాక్. ఆ వివరాలు..
కల్కి సినిమా నటీనటుల రెమ్యూనరేషన్ గురించి ఇప్పటికే అనేక వార్తలు రాగా.. తాజాగా కమల్ హాసన్ తీసుకున్న పారితోషికం ప్రతి ఒక్కరిని షాక్‌కు గురి చేస్తోంది. 7 నిమిషాల కోసం కమల్ కోట్ల రూపాయలు తీసుకున్నాడని టాక్. ఆ వివరాలు..
Dharani
వారం రోజులు నుంచి ఎక్కడ చూసినా.. విన్నా కల్కి పేరే. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద సుమారు 600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకోనే ప్రధాన పాత్రల్లో.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమా తెరకెక్కింది. జూన్ 27న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే 500 కోట్ల క్లబ్‌లో చేరిన కల్కి.. ఇప్పుడు 1000 కోట్ల దిశగా పరుగులు తీస్తుంది. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో జీవించగా.. సుప్రీమ్ విలన్ యాస్కిన్ గెటప్‌లో విశ్వ నటుడు కమల్ హాసన్.. అదరగొట్టారు. ఇక భైరవ పాత్రలో ప్రభాస్.. ఇద్దరు సీనియర్లైన కమల్, అమితాబ్‌లకు గట్టి పోటీ ఇచ్చాడు. అద్భుతమైన క్లైమాక్స్‌తో కల్కి పార్ట్ 1ను ముగించి.. పార్ట్ 2పై అంచనాలను మరింత పెంచారు.
సుమారు 600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో కల్కి సినిమాను తెరకెక్కించారు. దీనిలో అధిక భాగం.. రెమ్యూనరేషన్‌లకే కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రభాస్, అమితాబ్, దీపికాలకు భారీగా రెమ్యూనరేష్ ఇచ్చారు. వీరితో పాటు కమల్ హాసన్‌కు కూడా కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చారని తెలుస్తోంది. కల్కి పార్ట్ 1లో కమల్ హాసన్ కనిపించింది కేవలం 7 నిమిషాలు మాత్రమే. అయినా సరే ఆయన ఏకంగా 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని ఫిల్మ్ వర్గాల్లో జోరుగా ప్రచారం అవుతోంది. అంటే నిమిషానికి ఏకంగా సుమారు 2.50 కోట్ల రూపాయలు పారితోషికంగా అందుకున్నారని తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే కల్కి కోసం ప్రభాస్, అమితాబ్‌ల కన్నా కమల్‌కే ఎక్కువ ఇచ్చినట్లు.
ఇక కల్కి పార్ట్ 1లో తన పాత్ర తక్కువ సమయం మాత్రమే ఉంటుందని.. కానీ పార్ట్ 2లో తను తెర మీద కనిపించే సమయం చాలా ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే కమల్ హాసన్ ప్రకటించారు. అది వాస్తవం కూడా. పార్ట్ 2 లో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలే కీలకం కానున్నట్లు ఇప్పటికే అందరికి అర్థం అయ్యింది. ఇక కల్కి సినిమాలో యాస్కిన్ రోల్‌కు కమల్ మాత్రమే సూట్ అవుతాడని భావించిన నాగ్ అశ్విన్.. ఆయనను ఒప్పించడం కోసం దాదాపు ఏడాది పాటు కష్టపడ్డారట.
నాగి డెడికేషన్, కసి, పట్టుదల చూసిన కమల్.. ఫస్ట్ పార్ట్‌లో తన రోల్ చిన్నదే అయినా.. ఒప్పుకున్నారట. అమితాబ్ బచ్చన్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కడంతో.. మూవీలో నటించేందుకు ఓకే చెప్పిన కమల్.. డేట్స్ కూడా నాగి అనుకున్న టైంకే ఇచ్చారట. ఇప్పుడు మాత్రం కమల్ రెమ్యూనరేషన్‌కు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. కేవలం 7 నిమిషాల క్యారెక్టర్‌కు అంత రెమ్యునరేషనా అనే కామెంట్ చేస్తున్నారు నెటిజనులు.