iDreamPost

కల్కి మూవీలో అశ్వత్థామ తలదాచుకున్న గుడి నెల్లూరులోనే ఉంది! దాన్ని ఎవరు కట్టారో తెలుసా?

  • Published Jun 29, 2024 | 3:49 PMUpdated Jun 29, 2024 | 3:49 PM

Kalki 2898 AD, Ashwatthama, Nellore District: కల్కి సినిమాలో అశ్వత్థామగా నటించిన అమితాబ్‌ బచ్చన్‌ తలదాచుకున్న గుడి నెల్లూరులోనే ఉంది. మరి ఆ గుడి విశేషాలు ఏంటి? ఆ గుడిని ఎవరు కట్టారు? లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్కి మానిమా నడుస్తోంది. ప్రభాస్‌ హీరోగా, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. తొలి రోజే ఏకంగా 190 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, విజయ్‌ దేవరకొండ, దిషా పటాని లాంటి స్టార్లు ఈ సినిమాలో నటించారు. వీరికి తోడు రాజమౌళి, ఆర్జీవీ, సల్మాన్‌ దుల్కర్‌, మృణాల్‌ ఠాకూర్‌ కూడా చిన్న చిన్న కామియోలు చేశారు.

ఇలా భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా అంత భారీ సక్సెస్‌ దిశగా దూసుకెళ్తోంది. అయితే.. ఈ కల్కి 2898 ఏడీలో అశ్వత్థామగా నటించిన అమితాబ్‌ బచ్చన్‌ ఓ గుడిలో తలదాచుకుంటాడు. కొన్ని వందల ఏళ్లుగా ఆ గుడిలోనే ఆయన ఉంటాడు. కల్కి పుట్టికకు సమయం ఆసన్నమైనప్పుడు ఆ గుడి నుంచి బయటికి వస్తాడు. అయితే.. అన్ని వందల ఏళ్లు అశ్వత్థామకు ఆశ్రయమించినట్లు చూపించిన ఆ గుడి.. నిజానికి మన నెల్లూరు జిల్లాలోనే ఉంది. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడులోని నాగేశ్వరస్వామి ఆలయమే.. కల్కిలో అశ్వత్ధామ తలదాచుకున్న ఆలయంగా చూపించారు.

సినిమాలో ఆ ఆలయం కాశీలో ఉన్నట్లు చూపించారు. కానీ, నిజానికి ఆ ఆలయం నెల్లూరులో ఉంది. పెన్నానది తీరంలో దశాబ్దాలా పాటు ఇసుక పొరల్లో ఉండిపోయిన ఈ ఆలయం.. 2020లో ఇసుక తవ్వకాల్లో బయటపడింది. సప్త చిరంజీవుల(మరణం లేని వారు)లో ఒకడైన అశ్వత్థామ లాగే పరశురాముడు కూడా చిరంజీవుడే. ఈ ఆలయాన్ని ఆయనే నిర్మించనట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 1850లో వచ్చిన వరుదల్లో ఈ ఆలయం ఇసుకలో కూరుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే.. ఈ ఆలయం బయటపడిన సమయంలో కంటే.. ఈ ఆలయాన్ని కల్కి సినిమాలో చూపించిన తర్వాత.. ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి