iDreamPost
android-app
ios-app

Kalki 2898 AD: APలో భారీగా పెరగనున్న కల్కి టికెట్‌ ధరలు.. ఎంతంటే?

  • Published Jun 25, 2024 | 11:19 AM Updated Updated Jun 25, 2024 | 11:19 AM

కల్కి మూవీ టికెట్‌ ధర పెంపుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దాంతో ఏపీలో కల్కి టికెట్‌ ధరలు భారీగా పెరగనున్నాయి. ఆ వివరాలు..

కల్కి మూవీ టికెట్‌ ధర పెంపుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దాంతో ఏపీలో కల్కి టికెట్‌ ధరలు భారీగా పెరగనున్నాయి. ఆ వివరాలు..

  • Published Jun 25, 2024 | 11:19 AMUpdated Jun 25, 2024 | 11:19 AM
Kalki 2898 AD: APలో భారీగా పెరగనున్న కల్కి టికెట్‌ ధరలు.. ఎంతంటే?

దేశమంతా కల్కి ఫీవరే కొనసాగుతోంది. ఎక్కడ చూడు కల్కి నామ జపమే వినిపిస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే అభిమానులు కల్కి కౌంట్‌ డౌన్‌ ప్రారంభించారు. జూన్‌ 27కు మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ మొదలవ్వడమే కాక రికార్డ్స్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. ఇక ఓవర్సీస్‌ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక హైదరాబాద్‌ జోన్‌లో కల్కి ఫస్ట్‌ డే బుకింగ్స్‌లో రికార్డ్స్‌ క్రియేట్‌ చేసింది. ఇక ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కల్కి టికెట్‌ ధరల పెంపు, బెనిఫిట్‌ షోలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 10 రోజుల పాటు కల్కి టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్‌ అనుమతిచ్చింది. ఇక ఫస్డ్‌ డే మల్టిప్లెక్స్‌లో కల్కి చూడాలంటే.. 500 రూపాయలు ఖర్చు చేయాల్సిందే. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా కల్కి టికెట్‌ రేట్ల పెంపుకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. ఆ వివరాలు…

ఇప్పటికే హైదరాబాద్‌ సహా అనేక ప్రాంతాల్లో కల్కి టికెట్ల ఆన్‌లైన్‌ విక్రయాలు మొదలయ్యాయి. టికెట్ ధర పెంపుపై కల్కి టీమ్‌ రెండు తెలుగు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసుకుంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడమే కాక.. టికెట్‌ ధరల పెంపుతో పాటు.. బెనిషిట్‌ షోలకు కూడా అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా కల్కి సినిమా టికెట్‌ ధరల పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కల్కి టికెట్‌ ధరలను పెంచుకునేందుకు ఏసీ సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అలానే ‘కల్కి 2898 ఏడీ’ సినిమా అదనపు షోలకు ఆమోదం తెలిపింది. రెండు వారాలపాటు ఈ వెసులుబాటును కల్పించింది.

కల్కి సినిమా కోసం టికెట్‌ ధరల పెంపుతో పాటు అదనపు షోలకు అనుమతి ఇవ్వాలని చిత్ర నిర్మాత అశ్వినీదత్‌ కోరడంతో ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. ఈ క్రమంలో టికెట్‌పై సింగిల్‌ స్క్రీన్‌ సాధారణ థియేటర్‌లో అయితే రూ.75, మల్టీప్లెక్స్‌లలో అయితే రూ.125 వరకు పెంచుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా రోజుకు ఐదు షోలు నిర్వహించుకునేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్కి టికెట్‌ ధరలు భారీగా పెరిగాయి. సినిమా విడుదలైన వారం, పది రోజుల వరకు టికెట్‌ ధరలు భారీగానే ఉండనున్నాయి.